TGSRTC: ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్: ఆర్టీసీ ఎండీ
ABN , Publish Date - Feb 17 , 2025 | 03:07 PM
TGSRTC: తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకు వచ్చిన మహాలక్ష్మీ పథకం సూపర్ సక్సెస్ అయింది. ఈ పథకంలో భాగంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో పోటెత్తుతున్నారు. అలాంటి వేళ.. ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ వి.సి. సజ్జనార్ మరో గుడ్ న్యూస్ చెప్పారు.

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ).. ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ చెందిన బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ ఛార్జీలో రాయితీ ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం మహాలక్ష్మీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. దీని వల్ల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి మహిళలు మక్కువ చూపుతున్నారు. అదీకాక.. మహిళ ఉచిత ప్రయాణ పథకం వల్ల ప్రభుత్వానికి భారీగా నగదు వస్తుందంటూ సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
అదే విధంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి 10 శాతం రాయితీ ఇస్తామని టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది. అయితే ఇది అన్ని రూట్లలో కాదని.. బెంగళూరు- హైదరాబాద్ మార్గంలో మాత్రమేనని క్లియర్ కట్‌గా స్పష్టం చేసింది. బెంగళూరు మార్గంలో నడిచే అన్ని సర్వీసుల్లోనూ.. ఈ రాయితీని అమలు చేస్తున్నామని స్పష్టం చేసింది. ఈ రాయితీ వల్ల ఒక్కొక్క టికెట్‌పై రూ. 100 నుంచి రూ.160 వరకు ఆదా చేసుకోవచ్చని ప్రయాణికులకు ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మార్గంలో టికెట్లు ముందస్తు రిజర్వేషన్ కోసం https: //tgsrtcbus.in వెబ్ సైట్‌ని సందర్శించాలని సూచించారు.
దేశంలో అది పెద్ద నగరాల్లో బెంగళూరు ఒకటి. అక్కడ సైతం తెలంగాణ ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెన్షల్స్ లక్షల సంఖ్యలో ఉన్నారు. అలాగే పలువురు వ్యాపార నిమిత్తం తరచూ కర్ణాటక రాజధాని బెంగుళూరు వెళ్లి వస్తూ ఉంటారు. అంతేకాదు.. ప్రభుత్వ కొలువులు నిర్వహించే ఉన్నతాధికారులు సైతం అక్కడ ఉన్నారు. వారందరిని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అధికారులు ఈ రాయితీని తీసుకు వచ్చారని సమాచారం. మరోవైపు శని, ఆదివారాలు సెలవులు. ఈ నేపథ్యంలో బెంగుళూరు నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్లి వచ్చారు అత్యధికంగా ఉంటారు.
అలాంటి వారు.. ఈ రాయితీ పథకాన్ని వినియోగించుకొంటే వారికి నగదు ఆదా అవుతోందని ఆర్టీసీ అధికారులు వివరిస్తున్నారు. ఇంకోవైపు.. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన మార్గాల్లో సైతం ఈ తరహా ప్రవేశపెట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. అదీకాక ఇప్పటికే ఆర్టీసీ ఎండీ, వైస్ చైర్మన్ వి.సి. సజ్జనార్.. హైదరాబాద్ - బెంగళూరు మార్గంలో ప్రయాణికులకు రాయితీ కల్పిస్తున్నట్లు.. ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. అందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
For Telangana News and Telugu News