Bhu Bharati: అమల్లోకి భూ భారతి.. పోర్టల్‌లోని సేవలివే..
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:56 PM
Bhu Bharati: భూములకు రక్షణ కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే భూ భారతి పోర్టల్‌ను ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పోర్టల్‌ను నిన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ భూ భారతి పోర్టల్ రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని రేవంత్ ప్రభుత్వం చెబుతోంది.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ఈ పోర్టల్‌లో పది మాడ్యూల్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్, నాలా, అప్పీల్, భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, నిషేధిత భూములు, ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలు, ఇతరాల పేరిట ప్రత్యేక మాడ్యూల్స్‌ను పొందుపరిచారు. పోర్టల్‌లో సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫొటోలు ఉన్నాయి. తెలంగాణ రాజముద్ర, తెలంగాణ రైసింగ్ లోగోలు, ప్రతి మాడ్యుల్లో ప్రత్యేకంగా రూపొందించిన తెలంగాణ తల్లితో కూడిన లోగోను పొందుపరిచారు. నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద భూభారతి పోర్టల్ జూన్ 2వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.
ఈ వార్తలు కూడా చదవండి
Narendra Modi: తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు
KTR: ఒక్కసారి ఓటేస్తే.. ఐదేళ్ల శిక్షగా మారింది!
Kishan Reddy: అంబేడ్కర్‌ను అవమానించిన నీచ చరిత్ర కాంగ్రెస్‌ది
Read Latest Telangana News And Telugu News