Bandi Sanjay Letter: కరీంనగర్‌లో టీటీడీ ఆలయం.. బీఆర్ నాయుడుకు బండి లేఖ
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:28 PM
Bandi Sanjay Letter: కరీంనగర్‌లో చేపట్టిన టీటీడీ ఆలయ నిర్మాణానికి సహకరించాలంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు.

హైదరాబాద్, ఏప్రిల్ 5: కరీంనగర్‌లో (Karimanagar) చేపట్టిన టీటీడీ ఆలయ నిర్మాణం (TTD Temple) అంశాన్ని టీటీడీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు కేంద్రమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay). కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణం కోసం ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారని, యుద్ధప్రాతిపదికను పనులు చేయించాలంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు (TTD Chairman BR Naidu) కేంద్రమంత్రి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారంతో పాటు హిందూ దేవాలయాల నిర్మాణ అభివృద్ధి టీటీడీ చేస్తున్న కృషి భేష్ అని మెచ్చుకున్నారు. ధూప-దీప నైవేద్యాలకు నోచుకోని అనేక దేవాలయాలను ఆదుకోవడం చాలా గొప్ప విషయమని కొనియాడారు.
ప్రధాని మోదీ మద్దతుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఏపీ అభివృద్ధిని చూడబోతున్నామన్నారు. టీటీడీ చైర్మన్ నాయకత్వంలో భక్తులంతా భక్తిభావంతో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి ఆశీస్సులను పొందుతున్నారని తెలిపారు. తిరుమలలో చేపట్టిన చర్యలు భక్తుల నుంచి విశేషమైన ప్రశంసలు పొందుతున్నాయని చెప్పారు. కరీంనగర్‌లో చేపట్టిన టీటీడీ ఆలయ నిర్మాణానికి సహకరించాలన్నారు. 2023లోనే కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించిందని తెలిపారు. ఇందులో కరీంనగర్ పద్మానగర్‌లో 10 ఎకరాల భూమిని కేటాయించారన్నారు.
Gold Price News: పసిడి రేటు ఢమాల్.. వెంటనే కొనేసేయండి
అదే ఏడాది మే 31న కరీంనగర్‌లోని 10 ఎకరాల స్థలంలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధుల సమక్షంలో భూమి పూజ కూడా జరిగిందని చెప్పారు. నాటి నుంచి నేటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. టీటీడీ ఆలయ నిర్మాణం కోసం కరీంనగర్ సహా పొరుగు జిల్లాల ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. టీటీడీ నిర్మాణ పనులు యుద్ద ప్రాతిపదికన కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖలో కోరారు.
ఇవి కూడా చదవండి
Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం
YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో
Read Latest Telangana News And Telugu News