Hyderabad: ఏం డౌట్ లేదు.. ఆ కట్టడాలు ఎక్కడున్నా కూల్చేసుడే...
ABN , Publish Date - Apr 12 , 2025 | 01:29 PM
ఏం డౌట్ లేదు.. ఆ కట్టడాలు ఎక్కడున్నా కూల్చేసుడే.. అని అంటున్నారు అధికారులు. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో ‘కనిపిస్తే జాగా.. వేసేయ్ పాగా..’ అన్నట్లుగా ప్రభుత్వ స్థలాలన్నీ ఆక్రమణలకు గురవుతున్నాయి.

- అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్: రాజేంద్రనగర్(Rajendranagar) మండలం హైదర్‌గూడ(Hyderguda) ఎర్రబోడ సర్వే నెంబర్.7లోని ప్రభుత్వ భూమిలో 1200 గజాల స్థలాన్ని కొందరు ప్రైవేట్ వ్యక్తులు నకిలీ పత్రాలను సృష్టించి ప్రహరీతోపాటు గదిని నిర్మించడంతో శుక్రవారం రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయం అధికారులు కూల్చివేశారు. వివరాలోకి వెళ్తే.. హైదర్‌గూడ సర్వే నెంబర్.7లో ప్రభుత్వ భూమి ఉండేది. ఇందులో స్థానికులు శ్రీ సప్తగిరి వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించగా, మరి కొంత స్థలాన్ని విద్యుత్ సబ్‌స్టేషన్‌కు కేటాయించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నల్లాలకు బిగించిన మోటర్లు సీజ్..
ఇదే ప్రాంతంలో హైదర్‌గూడ దళితులకు శ్మశానవాటిక కోసం స్థలం కావాలని అప్పట్లో టీడీపీ రాజేంద్రనగర్ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కే ఎస్ రత్నం 1997లో రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. దళితుల శ్మశానవాటికకు స్థలం కేటాయించకపోతే ఒక దశలో ఆయన పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని అధికారులను హెచ్చరించారు. దీంతో అదే రోజున రంగారెడ్డి కలెక్టర్ దళితుల శ్మశానవాటికకు ఎర్రబోడ సర్వే నెంబర్.7లో రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తూ జీవో విడుదల చేశారు.
అక్కడ శ్రీ సప్తగిరి వేంకటేశ్వర స్వామి ఆలయం ఉండడంతో శ్మశానవాటికగా ఆ స్థలాన్ని ఎవరూ ఉపయోగించలేదు. అదే స్థలానికి సమీపంలో ఉన్న 1200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో కొందరు వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుండగా స్థానికుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ బి.రాములు ఆధ్వర్యంలో తొలగించారు. రాజేంద్రనగర్ తహసీల్దార్ ప్రత్యేక చొరవ తీసుకుని ఎర్రబోడ భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
గిరిగిరిగడ్డలో..
నార్సింగ్: నార్సింగ్ మున్సిపాలిటీలోని గిరిగిరిగడ్డలో అనుమతి లేకుండా నిర్మించిన అదనపు అంతస్థును మున్సిపల్ అధికారులు శుక్రవారం సాయంత్రం కూల్చివేశారు. స్థానికులు ఫిర్యాదు చేయగా, అధికారులు కూల్చివేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా
ఒక్క క్లిక్‌తో స్థలాల సమస్త సమాచారం!
రైల్వే తీరుతో ప్రయాణికుల పరేషాన్
Read Latest Telangana News and National News