CP Sudheer Babu: హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరిగేలా ఐపీఎల్‌

ABN, Publish Date - Mar 22 , 2025 | 07:30 AM

హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచేలా నిర్వహించేందుకు ఉప్పల్‌ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మ్యాచ్ లకు కల్పిస్తున్న భద్రత గురించి పలు విషయాలను ఆయన వెల్లడించారు.

CP Sudheer Babu: హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరిగేలా ఐపీఎల్‌

- పోలీస్‌ పహరాలో ఉప్పల్‌ స్టేడియం

- 450 సీసీటీవీ కెమెరాలతో నిఘా

- మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక షీటీమ్స్‌ ఏర్పాటు

-19 ప్రాంతాల్లో పార్కింగ్‌కు ఏర్పాట్లు

- రాచకొండ సీపీ సుధీర్‌బాబు

హైదరాబాద్‌ సిటీ: ఉప్పల్‌ స్టేడియం(Uppal Stadium)లో జరగనున్న టాటా ఐపీఎల్‌-2025 (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) సీజన్‌-18 మ్యాచ్‌లను హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచేలా నిర్వహించేందుకు ఉప్పల్‌ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudheer Babu) పేర్కొన్నారు. ఈ మేరకు మల్కాజిగిరి డీసీపీ పద్మజారెడ్డి, హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, ఇతర అధికారులతో కలిసి ఉప్పల్‌ స్టేడియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఈ వార్తను కూడా చదవండి: Rain: నగరంలో.. వడగళ్ల వాన


- 3వేల మంది పోలీసులతో పహరా..

మొత్తం 9వేల సీటింగ్‌ కెపాసిటీ ఉన్న స్టేడియంలో 3వేల మంది పోలీస్‌ బలగాలతో పహరా, పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఈ ఏడాది 450 సీసీటీవీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సీజన్‌లో మొత్తం 9 మ్యాచ్‌లు నగరంలో జరగనున్నాయన్నారు. ఈ నెల 23న జరిగే మ్యాచ్‌ మాత్రమే పగటిపూట జరుగుతుందని, మిగిలిన 8 మ్యాచ్‌లు రాత్రిపూటనే జరుగుతాయని తెలిపారు. శుక్రవారం రాత్రి నుంచి స్టేడియాన్ని రాచకొండ పోలీసుల ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.


ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బందితో పాటు.. డీసీపీలు, ఏసీపీలు నేరుగా స్టేడియంలో తిరుగుతూ భద్రతను పర్యవేక్షించనున్నట్లు సీపీ తెలిపారు. మహిళలకు, చిన్నారులకు ఇబ్బందులు కలగకుండా, పోకిరీలు, ఆకతాయిలు వేధించకుండా షీటీమ్‌ బృందాలను మఫ్టీలో ఉంటారని సీపీ స్పష్టం చేశారు. స్టేడియం చుట్టుపక్కల మొత్తం 19 ప్రాంతాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేశామన్నారు. వీఐపీల కోసం స్టేడియం సమీపంలో 5 ప్రధాన పార్కింగ్‌ ప్రాంతాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.


ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా రోజుల్లో నగరంలోకి వచ్చే భారీ వాహనాలను దారిమళ్లిస్తామని సీపీ తెలిపారు. క్రికెట్‌ అభిమానులు మైదానంలోకి వచ్చేటప్పుడు నిర్వాహకులు ప్రకటించిన నిషిద్ధ వస్తువులు తీసుకురావద్దని సీపీ సూచించారు. వాహనదారులు తమ హెల్మెట్స్‌ను వాహనం వద్దనే ఉంచి లాకింగ్‌ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగే తొమ్మిది రోజులూ ఫైర్‌ డిపార్టుమెంట్‌ను, అంబులెన్స్‌ సేవలను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.


- మెట్రో సేవలు ఉపయోగించుకోవాలి.

ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లను తిలకించడానికి వచ్చే క్రికెట్‌ అభిమానులు మెట్రో, ఆర్టీసీ సేవలు వినియోగించుకోవడం ఉత్తమమని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అభిప్రాయపడ్డారు. మెట్రో, ఆర్టీసీ సేవలను అర్థరాత్రి 12గంటలకు ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

విద్యుత్‌ చార్జీలు పెంచడం లేదు

మామునూరు ఎయిర్ పోర్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం

ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 22 , 2025 | 10:03 AM