Share News

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కార్యాచరణ

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:42 AM

జిల్లాలో రోడ్డు ప్రమాదాల ని యంత్రణకు పటిష్టమైన కార్యాచరణ అమలుచేయాలని కలెక్టర్‌ సందీ ప్‌కుమార్‌ ఝా ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కార్యాచరణ

సిరిసిల్ల, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల ని యంత్రణకు పటిష్టమైన కార్యాచరణ అమలుచేయాలని కలెక్టర్‌ సందీ ప్‌కుమార్‌ ఝా ఆదేశించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌ లో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రధాన కూడళ్లలో, అప్రోచ్‌ రోడ్ల వద్ద స్పీడ్‌బ్రేకర్లు లేనందున అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయ ని అలాంటి ప్రదేశాల్లో రబ్బరు స్ట్రిప్స్‌ స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాల న్నారు. పార్కింగ్‌ స్థలాల ఏర్పాటుకు ప్రతిపాదనలుతయారు చేయాల ని ఆదేశించారు. ప్రమాదాల నివారణకు ప్రస్తుతం రేడియం స్టిక్కర్లు, సైన్‌బోర్డులు ఏర్పాటుచేయాలని సూచించారు. రోడ్లపై వ్యూ అంతరా యం కలగకుండా పిచ్చిమొక్కలు, పూర్తిగా తొలగించాలన్నారు. ప్రమా దాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాల్లో రేడియం సైన్‌బోర్డు ఏర్పా టుచేయాలన్నారు. జిల్లాలోని అంతర్గత ప్రాంతాల్లో జరిగే ప్రమాదాల నివారణకు అవసర మైన చర్యలు చేపట్టాలని రోడ్డు, మరమ్మతులపై శ్రద్ధ వహించాలని అవసరమైన చోట డీవైడర్లు, స్పీడ్‌ బ్రేకర్లు, స్పీడ్‌ కట్రోల్‌ సోలార్‌లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు భద్రత ప్రమాణా లపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదా ల్లో అధికంగా తంగళ్లపల్లి, తిప్పాపూర్‌ ఎక్స్‌రోడ్డు, గంభీరావుపేట, కోన రావుపేట, ముస్తాబాద్‌, చందుర్తి, బోయినపల్లి కోదురుపాక జంక్షన్‌వం టి 13 ప్రదేశాల్లో బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి రోడ్‌ సేప్టీ జాగ్రత్తలు తీసు కోవాలని తెలిపారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటరమణ య్య, జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, పీర్‌ ఈఈ సుదర్శన్‌రెడ్డి, డీఎంహెచ్‌వో రజిత, ఆర్‌టీఏ కమిటీ సభ్యు డు సంగీతం శ్రీనాథ్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 12:42 AM