కన్నుల పండువగా చంద్ర రథోత్సవం
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:45 AM
ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి స్వామివారి ఉత్సవమూరులు చంద్ర రథంపై కొలువుదీరాయి.

- ప్రత్యేక పూజలు చేసిన ప్రముఖులు
- మొక్కులు చెల్లించుకున్న భక్తులు
ఇల్లందకుంట, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి స్వామివారి ఉత్సవమూరులు చంద్ర రథంపై కొలువుదీరాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు స్వామివారుం ఆలయ తిరుమాడ వీధుల్లో చంద్ర రథంపై విహరించారు. భక్తులు తాళ్లతో రథాన్ని లాగారు. సుమారు గంట పాటు రథ యాత్ర కొనసాగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు, ఈవో సుధాకర్ అన్ని ఏర్పాట్లు చేశారు. హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌జీ ఆధ్వర్యంలో సీఐలు కిశోర్, తిరుమల్‌గౌడ్, రవి, వెంకట్‌గౌడ్, ఎస్‌ఐలు తోట తిరుపతి, రాజకుమార్ బందోబస్తు నిర్వహించారు. రథోత్సవానికి సుమారు 70వేల మంది భక్తులు హాజరయ్యారు.
ఫ రాములోరిని దర్శించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే
ఇల్లందకుంట సీతారామచంద్రస్వామిని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు, అర్చకులు స్వామివారి జ్ఞాపికను అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పెద్దపల్లి గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, నాయకులు వినుపాల ప్రకాష్‌రావు, సుమన్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సంజీవరెడ్డి, పర్శరాములు, పెద్ది కుమార్ పాల్గొన్నారు.
ఫ భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి చంద్ర రథోత్సవానికి హాజరైన భక్తులకు బీజేపీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు సంపత్‌రావు, రవీందర్‌రెడ్డి, షఫీ, తిరుపతిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, విజయ్‌బాబు, గోపాల్, దుర్గయ్య పాల్గొన్నారు.
ఫ రాములోరిని దర్శించుకున్న ఈటల
చంద్రరథంపై కొలువుదీరిన సీతారామచంద్రస్వామిని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లందకుంట రాముడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలన్నారు. అనంతరం ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నాయిని సుప్రీయ, ఈవో సుధాకర్‌లు ఎంపీ ఈటల రాజేందర్‌ను సన్మానించారు.