తాగునీటి ఇబ్బందులు కలుగకుండా చూడాలి
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:40 PM
రామగుండం నగరపాలకసంస్థ పరిధి లో వేసవిలో తాగునీటికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. మంగళవారం ఎన్‌టీపీసీ అనుమతులు, అభివృద్ధి పనులు, వీధిదీపాలు తదితర విషయాలపై ఇంజనీరింగ్, ఎన్‌పీడీసీఎల్, ఎన్‌టీపీసీ హెచ్‌ఆర్ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు.

కోల్‌సిటీ, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలకసంస్థ పరిధి లో వేసవిలో తాగునీటికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. మంగళవారం ఎన్‌టీపీసీ అనుమతులు, అభివృద్ధి పనులు, వీధిదీపాలు తదితర విషయాలపై ఇంజనీరింగ్, ఎన్‌పీడీసీఎల్, ఎన్‌టీపీసీ హెచ్‌ఆర్ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. తాగునీటి విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నీటి సరఫరాపై వార్డు అధికారులు నిత్యం పరిశీ లన చేయాలన్నారు. కార్పొరేషన్‌లో వీధి దీపాల సమస్య ఉండకూడదని, ఎక్కడ వీధి దీపాలు వెలగకున్నా వెంటనే అప్రమత్తం కావాలన్నారు. అభి వృద్ధి పనుల్లో వేగం పెంచాలని, అతాధికారులు క్షేత్ర స్థాయిలో రోజు తనిఖీలు చేయాలన్నారు. ఎన్‌టీపీసీ నిర్మాణాలు, అనుమతుల విషయంపై చర్చించారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్(సీఎల్‌యూ) విషయమై షార్ట్ ఫాల్స్‌ను పరిష్కరించుకోవడంలో ఎన్‌టీపీసీ దృష్టి పెట్టాలని ఆదేశించిన కలెక్టర్ సంబంధిత డీటీసీపీ అధికారులతో మాట్లాడారు. సీఎల్‌యూ జీఓ రాగానే వెంటనే ఫీజులు చెల్లించి అనుమతులు తీసుకోవాలని ఎన్‌టీపీసీ హెచ్‌ఆర్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్పొరేషన్‌లో ఎల్‌ఆర్‌ఎస్ గడువు ఏప్రిల్ 30వరకు పొడిగించినందున దరఖాస్తుదారులు ఫీజు చెల్లించేలా కార్పొషన్ యంత్రాంగం వారిని సంప్రదించాలన్నారు. 25శాతం రాయితీని వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్‌పీడీసీఎల్‌కు సంబంధించి చార్జీల విషయంలో ఎన్‌పీడీసీఎల్, కార్పొరేషన్‌లు సమీక్షించు కోవాలని, ఆస్తి పన్ను బకాయులు కూడా సర్దుబాటు చేసుకోవాలన్నారు. కార్పొరేషన్‌లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కడా చెత్తా చెదారం ఉండకుండా చూసువాలన్నారు. కమిషనర్ అరుణశ్రీ, కార్పొరేషన్ ఎస్‌ఈ శివానంద్, ఎన్‌టీపీసీ హెచ్‌ఆర్ అధికారులు సిఖిదర్, ఈఈ రామన్ పాల్గొన్నారు.