Share News

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:40 AM

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాషాయ జెండాను ఎగురవేసేందుక ప్రతిఒక్కరు కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

సిరిసిల్ల రూరల్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి) : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాషాయ జెండాను ఎగురవేసేందుక ప్రతిఒక్కరు కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. సిరిసిల్ల పట్టణంలోని రగుడు జంక్షన్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన బీజేపీ జిల్లా కార్యాలయా న్ని ఆదివారం గోపి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించా రు. అనంతరం భారతీయ జనతా పార్టీ స్థాపన దివ స్‌ సందర్భంగా జిల్లా అధ్య క్షుడు గోపి జెండాను ఎగురవేశారు. అనందరం జిల్లా అసుపత్రిలో రోగు లకు పండ్లు, బ్రెడ్‌లను పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా గోపీ మాట్లాడుతూ 1980 ఏప్రిల్‌ 6న దివం గత మాజీ ప్రధాని భారత రత్న అటల్‌ బీహారీ వాజ్‌పేయ్‌, ఎల్‌కే అద్వానీల ఆధ్వ ర్యంలో భారతీయ జనతా పార్టీని ప్రారంభించారన్నారు. ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం లో పార్టీ ముందుకు పోవడంతో పాటు రెండుసార్లు కేంద్రంలో అధికారంలో కొనసాగుతుందన్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో మరోసారి బీజేపీకి అవకాశం ఇచ్చేం దుకు ప్రజలల్లో చైతన్యం తీసుకవచ్చేందుకు ప్రతి కార్య కర్త కృషి చేయాలని కోరారు. అలాగే సిరిసిల్ల పట్టణం లోని గాంధీనగర్‌లో పార్లమెంటరీ కో-కన్వీనర్‌ అడెపు రవీందర్‌, శివనగర్‌లో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీని వాస్‌, టీఆర్‌నగర్‌లో తవుటం రాజలింగం, కార్గిల్‌లేక్‌ వద్ద ఎస్టీ మోర్చా అధ్యక్షులు మొగిలి రాజులు బీజేపీ జెండాలను ఎగురవేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రం మహేష్‌, అల్లాడి రమేష్‌, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు మ్యాన రాంప్రసాద్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షు డు రాగుల రాజిరెడ్డి, ఎస్సీ మోర్చా చంటి మహేష్‌, ఎస్టీ మోర్చా కోనేటి సాయిలు, సిరిసిల్ల అసెంబ్లీ నియోజక వర్గ కన్వీనర్‌ కారెడ్ల మల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నే హరీష, జిల్లా మాజీ అధ్యక్షురాలు బర్కం వెంకట లక్ష్మి, పట్టణ అధ్యక్షురాలు వేముల వైశాలి పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 12:41 AM