Share News

ఘనంగా రంజాన్‌

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:52 AM

జిల్లా వ్యాప్తంగా రంజాన్‌ పండుగను ముస్లింలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దల ప్రసంగాలు విని ఆధ్యాత్మిక భావంతో పరవశించిపోయారు. పరస్పరం ఆలింగనాలు చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కుల, మతాతీలకు అతీతంగా బంధు మిత్రులను ఇళ్లకు ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు.

ఘనంగా రంజాన్‌

కరీంనగర్‌ కల్చరల్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా రంజాన్‌ పండుగను ముస్లింలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దల ప్రసంగాలు విని ఆధ్యాత్మిక భావంతో పరవశించిపోయారు. పరస్పరం ఆలింగనాలు చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కుల, మతాతీలకు అతీతంగా బంధు మిత్రులను ఇళ్లకు ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు. వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌ వద్ద గల పురానీ (ఖదీమ్‌షాహి) ఈద్గాలో సయ్యద్‌ షా మొహమ్మద్‌ ఖాద్రి నమాజ్‌ చేయించి సందేశమిచ్చారు. చింతకుంట ఈద్గాలో మొహమ్మద్‌ ఖైరొద్దీన్‌ సందేశమివ్వగా ముఫ్తీ ఎత్తెమాదుల్‌ హక్‌ నమాజ్‌ చేయించారు. సాలెహ్‌నగర్‌ ఈద్గాలో ముఫ్తీ మహమ్మద్‌ ఘియాస్‌ మొహియొద్దీన్‌ సందేశమివ్వగా కరీంనగర్‌ సదర్‌ ఖాజీ మన్‌ఖబత్‌షాఖాన్‌ నమాజ్‌ చేయించారు. బైపాస్‌రోడ్‌లోని ఈద్గా అహ్మద్‌లో జమీయత్‌ ఐలే హదీస్‌ షహరీ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో మొహమ్మద్‌ యూసుఫ్‌ సందేశం ఇవ్వగా మొహమ్మద్‌ యూనుస్‌ మద్‌నీ నమాజ్‌ చేయించారు. ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు మొహమ్మద్‌ ఇస్మాయిల్‌ శుభాకాంక్షలు తెలిపారు. సీపి గౌస్‌ ఆలం పలు చోట్ల బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ట్రాఫిక్‌ పోలీసులు ప్రార్థనల సమయం ముగిసేవరకు వాహనాలను దారి మళ్లించారు. పలు చోట్ల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా శాఖల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ముస్లింల ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ‘పొన్నం’...

నగరంలోని పలువురు ముస్లింల ఇళ్లకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెళ్ళి శుభాకాంక్షలు తెలిపి విందులో పాల్గొన్నారు. సయ్యద్‌ షా ఖాజా మెహియొద్దీన్‌ ఖాద్రి నివాసంలో ఉత్సాహంగా గడిపారు. కుటుంబ సభ్యులకు స్వీట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీ సెల్‌ ప్రెసిడెంట్‌ అహ్మద్‌ అలీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ ఎస్‌ఏ మౌసిన్‌ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

కరీంనగర్‌ అంటే అన్ని మతాల వారు కలిసి ఉండే నగరం అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. సాలెహ్‌నగర్‌ ఈద్గా వద్ద ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ భావి తరాలకు బంగారు భవిష్యత్తు అందించే విధంగా ప్రతీ ఒక్కరూ కలసి మెలసి జీవించాలని అన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, మాజీ కార్పొరేటర్లు సుదగోని మాధవి కృష్ణగౌడ్‌, ఎదుళ్ల రాజశేఖర్‌, దిండిగాల మహేశ్‌, అర్బన్‌ బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌ కర్ర సూర్యశేఖర్‌, బీఆర్‌ఎస్‌ మైనారిటీ శాఖ నగర అధ్యక్షుడు మీర్‌ షౌకత్‌ అలీ, నాయకులు శ్రీనివాస్‌, నవాజ్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

సాలెహ్‌నగర్‌ ఈద్గా వద్ద ముస్లింలకు సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ సకల శుభాలు జరుగాలని ఆకాంక్షించారు.

Updated Date - Apr 01 , 2025 | 12:52 AM