Share News

పెరిగిన రవాణాశాఖ ఆదాయం

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:00 AM

ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 జిల్లా రవాణాశాఖ ఖజానా గలగల లాడింది. రూ.39.25 కోట్ల ఆదాయం సమకూరింది. 2023-24 ఆర్థిక సంవత్సరం కంటే 2024-25 అర్థిక సంవత్సరం రూ.1.55 కోట్లు అదనంగా ఆదాయం సమకూరింది. 2022 -23 అర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ. 33.08 కోట్ల ఆదాయం వచ్చింది.

పెరిగిన రవాణాశాఖ ఆదాయం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 జిల్లా రవాణాశాఖ ఖజానా గలగల లాడింది. రూ.39.25 కోట్ల ఆదాయం సమకూరింది. 2023-24 ఆర్థిక సంవత్సరం కంటే 2024-25 అర్థిక సంవత్సరం రూ.1.55 కోట్లు అదనంగా ఆదాయం సమకూరింది. 2022 -23 అర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ. 33.08 కోట్ల ఆదాయం వచ్చింది. 2023- 24 అర్థిక సంవత్సరంలో రూ.37.70 కోట్లు ఆదాయం వచ్చింది. 2024-25 అర్థిక సంవ త్సరంలో రూ 39.25 కోట్ల ఆదాయం లభించింది. ఇందులో త్రైమాసిక ట్యాక్స్‌ రూపంలో రూ. 6 కోట్ల 78 లక్షల 64 వేల ఆదాయం సమకూరింది. లైఫ్‌ ట్యాక్స్‌లో రూపంలో రూ.22 కోట్ల 57 లక్షల 55 వేలు, వివిధ ఫీజుల నిమిత్తం వచ్చిన అదాయం రూ.4 కోట్ల 68 లక్షల 15 వేలు, సర్వీస్‌ ఫీజులు రూపేణా రూ. కోటి 49 లక్షల 79 వేలు లభించింది. గ్రీన్‌ ట్యాక్స్‌ రూపంలో రూ. 53 వేల ఆదాయం వచ్చింది. జరిమానాల ద్వారా రూ. కోటి 84 లక్షల 15305 ఆదాయం లభించింది. 2023- 24 అర్థిక సంవత్సరంలో త్రైమాసిక ట్యాక్స్‌ రూ. 6.70 కోట్లు ఆదాయం సమకూరింది. లైఫ్‌ ట్యాక్స్‌లో రూ.23.80 కోట్లు, వివిధ ఫీజు ల ద్వారా రూ 4.93 కోట్లు, రూ 1.28 కోట్లు లభించింది. జరిమానాల ద్వారా రూ. 97.7 లక్షలు లభించాయి

వ్యక్తిగత వాహనాల పైనే ఆసక్తి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 5.52 లక్షల జనాభా ఉంది. దాదాపు 1.77 లక్షల ఇళ్లు ఉన్నాయి. 1.46 లక్షల వాహనాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వాహనాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ సంవత్సరం ఎలక్ర్టానిక్‌ వాహనాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ద్విచక్రవాహనాలు 1,01,902, కార్లు 13,279, స్కూల్‌ బస్సులు 162, రవాణా క్యాబ్‌లు 89, లగ్జరీ టూరిస్ట్‌ క్యాబ్‌లు 15, జీపులు 14, మోటార్‌ క్యాబ్‌లు 1,198, ప్రైవేటు ఓమ్ని బస్సులు 223, రోడ్‌ రోలర్‌లు 2, స్టేజీ క్యారియర్‌లు మోపెడ్‌, అండ్‌ మోటారైజ్‌డ్‌ సైకిల్‌ 4,959, త్రీవీలర్‌ గూడ్స్‌ వాహనాలు 1,439, వ్యవసాయ ట్రాక్టర్‌లు 5,609, కమర్షియల్‌ ట్రాక్టర్‌లు 4,196, సరుకుల రవాణా వాహనాలు 3042, ప్రైవేటు క్రేన్‌లు 8, కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించిన వాహనాలు 236, హార్వెస్టర్‌లు 660, అంబులెన్స్‌లు 39, ఆటోలు 3,673 లతో పాటు ఇతర వాహనాలు కూడా జిల్లాలో పెరిగాయి.

ట్యాక్స్‌లు, ఇన్సూరెన్స్‌లు సకాలంలో చెల్లించుకోవాలి

- లక్ష్మణ్‌, జిల్లా రవాణాశాఖ అధికారి

వాహనాల యజమానులు ట్యాక్స్‌లు, ఇన్సూరెన్స్‌లు సకాలంలో చెల్లించుకోవాలి. ఎప్పుడైనా అనుకోని సంఘటన చోటు చేసుకున్నప్పుడు పరిహారం పొందే వీలు ఉంటుంది. ట్యాక్స్‌ల చెల్లింపులపై అవ గాహన కల్పిస్తున్నాం. జిల్లా రవాణాశాఖ ఆదాయం ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 39.25 కోట్లు వచ్చింది. వాహనాలకు సంబంధించిన ఫిట్‌నెస్‌, ట్యాక్స్‌లు చెల్లించాలి. వాహనాలకు హైసెక్యూరిటీ నేమ్‌ ఫ్లేట్‌లు అమర్చుకోవాలి.

Updated Date - Apr 13 , 2025 | 01:00 AM