సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:24 PM
తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించా లని, లేకుంటే ఈనెల 19న నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీపెల్లి రవిందర్ అన్నారు. గురువారం జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, డిఎల్‌పీవో వేణుగోపాల్‌లక కార్మికులు సమ్మె నోటీస్ అందించారు.

పెద్దపల్లి టౌన్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించా లని, లేకుంటే ఈనెల 19న నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీపెల్లి రవిందర్ అన్నారు. గురువారం జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, డిఎల్‌పీవో వేణుగోపాల్‌లక కార్మికులు సమ్మె నోటీస్ అందించారు. సీపెల్లి రవిందర్ మాట్లాడుతూ కార్మికులు 40 ఏళ్లుగా పంచాయతీనే నమ్ముకుని సేవలు చేస్తున్నా కనీస వేతనాలు, ఉద్యోగ భధ్రత లేదన్నారు. జన వరి నుంచి గ్రీన్‌ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామన్నా హమీ నేటికి నెరవేరలేదని, గత ప్రభు త్వంలో ప్రస్తుత మంత్రులు కనీస వేతనాలు, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి అమలు చేయని పరి స్థితి ఉందన్నారు. గత ప్రభుత్వం తీసుకోచ్చిన జీవో 51 ద్వారా నైపు ణ్యం లేని పనులు చేయించడం వల్ల రాష్ట్రంలో 200 పైగా కార్మికులు చనిపోయారని. ప్రమాద బీమా సౌకర్యం లేక కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. పంచాయతీల్లో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లిం చాలని డిమాండ్ చేశారు. నాయకులు తిట్ల శ్రీనివాస్, అంబాల లక్ష్మణ్, మండల అద్యక్షులు మామిడి తిరుపతి, మండల కార్యదర్శి జంగపల్లి నరేష్, మద్దెల రాజ్‌కు మార్, శ్రీనివాస్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.