రాజ్యాంగాన్ని రక్షించుకుందాం..
ABN , Publish Date - Apr 04 , 2025 | 11:53 PM
రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండలంలోని నవాబుపేట, గాగిరెడ్డిపల్లి గ్రామాల్లో శుక్రవారం జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు.

చిగురుమామిడి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండలంలోని నవాబుపేట, గాగిరెడ్డిపల్లి గ్రామాల్లో శుక్రవారం జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమనికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేక పోతే దేశంలో ప్రజాస్వామ్యమే లేదన్నారు. అంబేద్కర్, గాంధీ చరిత్రను ప్రజలకు తెలియజేయడానికి గాంధీ ఫొటోలతో, రాజ్యాంగ పుస్తకాలతో ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత తనదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, హుస్నాబాద్ వ్యవసాయ మార్కుట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, చిట్టుమల్ల రవీందర్, ఐరెడ్డి సత్యనారయణరెడ్డి, పోలు స్వప్న, మాజీ సర్పంచ్ శ్రీముర్తి రమేష్, మాజీ జడ్పీటీసీ గీకురు రవీందర్ పాల్గొన్నారు.