Share News

నిరాహార దీక్షను జయప్రదం చేయండి..

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:39 AM

సిరిసిల్లలో సోమవారం చేపట్టిన 24గంటల నేతన్న దీక్షను జయప్ర దం చేయాలని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూని యన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌, జిల్లా అధ్యక్షుడు కోడం రమణలు కోరారు.

నిరాహార దీక్షను జయప్రదం చేయండి..

సిరిసిల్ల రూరల్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్లలో సోమవారం చేపట్టిన 24గంటల నేతన్న దీక్షను జయప్ర దం చేయాలని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూని యన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌, జిల్లా అధ్యక్షుడు కోడం రమణలు కోరారు. సిరిసిల్లలో మరమగ్గాలతోపాటు అనుబంధరంగాల కార్మికు కూలి నిర్ణయించి, సమస్యలను పరిష్కరించాలంటూ సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం 6వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమ్మె శిబిరం వద్ద జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ సిరిసిల్లలో కార్మికులు నిరవధిక సమ్మెచేస్తు న్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన ట్టుగా వ్యహరిస్తోందన్నారు. కార్మికులంటే అంత చులకని అన్ని అన్నారు. ప్రభుత్వం వెంట నే స్పందించి యాజమానులు, అధికారులతో చర్చలు జరిపించి కార్మికుల న్యాయమైన సమస్యల ను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సోమవారం 24 గంటల పాటు నేతన్నల దీక్షను చేపట్టనున్నామని, కార్మి కులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిరిమల్లె సత్యం, కుమ్మరికుంట కిషన్‌, నక్కు దేవదాస్‌, సబ్బని చంద్రకాంత్‌, గుండు రమేష్‌, ఎలిగేటి శ్రీనివాస్‌, మచ్చ వేణు, ఎక్కల్‌ దేవి జగదీష్‌, బోట్ల వెంకటేశం, ఐరన్‌ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 12:39 AM