Share News

క్రీడా రంగానికి మరింత ప్రోత్సాహం..

ABN , Publish Date - Apr 06 , 2025 | 12:32 AM

క్రీడారంగానికి ప్రజా ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తుందని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

క్రీడా రంగానికి మరింత ప్రోత్సాహం..

వేములవాడ, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి) : క్రీడారంగానికి ప్రజా ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తుందని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసి యేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజన్న ప్రీమియం లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ముగింపు కార్యక్రమం శనివారం వేములవాడలోని బాలానగర్‌ మైదానంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ క్రీడల నిర్వహణ వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ధారుఢ్యం పెంపొందుతుందన్నారు. వేము లవాడ ప్రాంతంలో మినీ స్టేడియం పనులు శరవేగంగా కొనసాగు తున్నాయని, మర్రిపల్లి ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలంలో క్రీడా మైదానం ఏర్పాటు త్వరలో ఆచరణలోకి వస్తుందన్నారు. ఎస్పీ మహేష్‌ బి గితే మాట్లాడుతూ నిత్యం బిజీగా ఉండే డాక్టర్లు, లాయ ర్లు, ఉపాధ్యాయులు, పోలీసులు, పాత్రికేయులు, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు అంతా ఒక చోట కలిసి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయ మన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్‌పీ శేషాద్రినిరెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌ శ్రీనివాస్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్‌ లీలా శిరీష, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ చీకోటి సంతోష్‌ కుమార్‌, కార్యదర్శి డాక్టర్‌ అభినయ్‌, సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ సత్యనారాయణ స్వామి, డాక్టర్‌ మనోహర్‌, డాక్టర్‌ ఎం ఆనందరెడ్డి, డాక్టర్‌ ఎన్‌ పద్మలత, డాక్టర్‌ శోభారాణి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుడిసె సదానందం, గవర్నమెంట్‌ లీడర్‌ బొడ్డు ప్రశాంత్‌, వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్‌, రూరల్‌ సీఐ శ్రీనివాస్‌, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఆయా జట్ల కెప్టెన్లు, క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విజేతలకు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎస్పీ మహేష్‌ బి గితే ట్రోఫీలు, క్రీడాకారులకు జ్ఞాపికలు అందజేశారు. టోర్నమెంట్‌ విజేతగా నిలిచిన పోలీసు అధికారులతో కూడిన రక్షక్‌ రేంజర్స్‌ జట్టును ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - Apr 06 , 2025 | 12:32 AM