Share News

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:26 AM

వివిధ సమస్యలతో ప్రజావాణికి వచ్చే వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, దరఖాస్తులు పెం డింగ్‌లో ఉండకుండా చూడాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన దరఖాస్తులను స్వీకరించారు.

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

పెద్దపల్లి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): వివిధ సమస్యలతో ప్రజావాణికి వచ్చే వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, దరఖాస్తులు పెం డింగ్‌లో ఉండకుండా చూడాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన దరఖాస్తులను స్వీకరించారు. కమాన్‌పూర్‌ మండలానికి చెం దిన కల్వల జయ తనకు కాగజ్‌నగర్‌లో ఉన్న రేషన్‌ కార్డును కమాన్‌ పూర్‌ మార్చాలని దరఖాస్తు చేసుకున్నారు. సుల్తానాబాద్‌ పట్టణానికి చెందిన సీహెచ్‌ శ్రీమన్నారాయణ తండ్రి పేరు మీద ఉన్న స్థలం క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోగా నిషేధిత స్థలం అని వస్తుందని, మా స్థలం ఉన్న ప్రాంతంలో చుట్టూ ఇళ్లు ఉన్నాయని, క్రమబద్ధీకరణ చేయాలని కలెక్టర్‌ను కోరారు. గోదావరిఖని పట్టణానికి చెందిన జీఆర్‌ ప్రసాద్‌ 49వ డివిజన్‌లో రోడ్డును ఆక్రమిస్తూ ప్రహరీ నిర్మాణం జరు గుతుందని, దీనిని తొలగించాలని దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు దారుల సమస్యల విన్న కలెక్టర్‌ సంబంధిత అధికారులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలోనే గాకుండా, తమ వద్దకు నేరుగా వచ్చే దరఖాస్తులను కూడా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ డి వేణు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 12:26 AM