చంద్రరథంపై సీతారాములు
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:32 AM
ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులను అర్చకులు చంద్రరథంపై అధిరోహించారు. సాయంత్రం నిత్యవిధి హోమం, రథబలి అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను, చంద్రరథాన్ని ఘనంగా అలంకరించారు.

ఇల్లందకుంట, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులను అర్చకులు చంద్రరథంపై అధిరోహించారు. సాయంత్రం నిత్యవిధి హోమం, రథబలి అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను, చంద్రరథాన్ని ఘనంగా అలంకరించారు. అనంతరం స్వామివారి ఉత్సమూర్తులను పల్లకిలో ఉంచి చంద్రరథంపైకి తీసుకొచ్చారు. రాత్రి 10:30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు, ఈవో కందుల సుధాకర్ ఏర్పాట్లు చేశారు.