Share News

ఽకొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు

ABN , Publish Date - Apr 16 , 2025 | 01:15 AM

యాసంగి సీజన్‌లో పండించిన వరి పంట కోతలు ఆరంభమై పదిహేను రోజులు గడుస్తున్నాయి. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించ లేదు. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారం భించామని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు గానీ ఇప్పటి వరకు ధాన్యం తూకం వేయడం లేదని రైతులు చెబుతున్నారు. ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉందనే సాకులు చూపుతూ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు.

ఽకొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు
పాలకుర్తి మండలం బసంత్‌ నగర్‌ కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని నేర్పుతున్న రైతులు

యాసంగి సీజన్‌లో పండించిన వరి పంట కోతలు ఆరంభమై పదిహేను రోజులు గడుస్తున్నాయి. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించ లేదు. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారం భించామని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు గానీ ఇప్పటి వరకు ధాన్యం తూకం వేయడం లేదని రైతులు చెబుతున్నారు. ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉందనే సాకులు చూపుతూ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ధాన్యం తూకం వేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో లక్షా 96 వేల ఎకరాల్లో వరి సాగు కాగా, తద్వారా 4 లక్షల 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తా యని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖాధికారులు అం చనా వేశారు. ఇతర అవసరాలకు పోనూ కేంద్రాలకు కనీసం 3 లక్షల 50 వేల టన్నుల ధాన్యం రానున్నదని పౌరసరఫరాల శాఖాధికారులు పేర్కొన్నారు. కానీ 4 లక్షల టన్నుల వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యాసంగి సీజన్‌లో పండించిన పంటను రైతులు కేవలం విత్తన కంపెనీ లకు మాత్రమే ధాన్యాన్ని విక్రయిస్తారు. ధాన్యం నూక అయ్యే అవకాశాలు ఉండడంతో ఈ ధాన్యాన్ని ఇంటి అవసరాలకు సద్వినియోగం చేసుకోరు. సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్‌ ప్రభు త్వం ప్రకటించడంతో ఈ సీజన్‌లో కూడా రైతులు 30 శాతానికి పైగా సన్నాలు సాగు చేశారు. జిల్లాలో వరి కోతలు ఊపందుకున్నాయి. కానీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

ఫ 15 రోజుల నుంచి కోతలు ఆరంభం..

జిల్లాలో పదిహేను రోజుల నుంచి వరి కోతలు మొదలయ్యాయి. వానాకాలం పంట కంటే యాసంగి సీజన్‌లో కోతలు వేగంగా జరుగుతాయి. పొలాల్లో బురద ఉండనందున కోతలు త్వరగా పూర్తవుతాయి. చాలా మంది రైతులు పంటను కోసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో రాశులు పోశారు. రోజు ఉదయం, మధ్యాహ్నం వేళలో ధాన్యాన్ని ఆరబోసి నేర్పుతున్నారు. నిబంధనల ప్రకారం ధాన్యంలో 17 శాతానికి మించి తేమ లేకుంటే మద్దతు ధర ఏ గ్రేడ్‌ ధాన్యానికి 2,330 రూపాయలు, కామన్‌ గ్రేడ్‌ రకం ధాన్యానికి 2,310 రూపాయలు ధర చెల్లించాల్సి ఉంటుంది. సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు అదనంగా 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 302 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 239 కేంద్రాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో 59, ఇతరత్రా 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడక్కడ ప్రజాప్రతి నిధులు కొనుగోలు కేంద్రాలను ఆరంభించారు. కానీ కొనుగోళ్లు చేపట్టడం లేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలోని మంథని, ముత్తారం, కమాన్‌పూర్‌, సుల్తానా బాద్‌, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, ధర్మారం, పాలకుర్తి, అంతర్గాం మండలాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌ ఎయిర్‌పోర్టు స్థలంలో పాలకుర్తి, కుర్మపల్లి, బసంత్‌ నగర్‌, కొత్తపల్లి, తక్కళ్లపల్లి గ్రామాలకు చెందిన పలు వురు రైతులు ధాన్యం కుప్పులు పోసి పది రోజులు కావస్తున్నది. రోజు ఉదయం వేళ ఆరబోసి నేర్పి సాయంత్రం వేళలో కుప్ప చేస్తున్నారు. వాతావరణంలో మార్పులు వస్తున్నాయని, ఒక రోజు ఎండ కొడుతూ, మరో రోజు మబ్బులు పడుతున్నదని, ఎప్పుడు అకాల వర్షాలు, రాళ్ల వర్షాలు కురిసేది తెలియదని రైతులు అంటున్నారు. ప్రతి యాసంగి సీజన్‌లో అకాల వర్షాలు, వడగళ్ల వర్షాలు కురిసి పంట నష్టపోవాల్సి వస్తున్నదని రైతులు తెలిపారు. ఆరుగాలం శ్రమించి చెమటోడ్చి పండించిన ధాన్యం వర్షార్పణం కాకుండా చూడాలని రైతులు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పం దించి సత్వరమే ధాన్యం కొనుగోళ్లను ఆరంభించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Apr 16 , 2025 | 01:16 AM