పోషణ లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:47 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా ను పోషణలోప రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదే శించారు.

సిరిసిల్ల కలెక్టరేట్, ఏప్రిల్(ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ను పోషణలోప రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదే శించారు. అంగన్‌వాడీ పిల్లల పోషణపై తీసుకోవలసిన చర్యలపై సీడీపీవో, సూపర్‌వైజర్లు, ఇతర అధికారులతో కలెక్టరేట్ మినీ సమా వేశ మందిరంలో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్‌వాడీ సిబ్బంది రోజువారి పనుల ను పరిశీలించాలని పేర్కొన్నారు. మీ కేంద్రాలకు వచ్చేవారికి ప్రభు త్వం నుంచి వచ్చే వాటిని సక్రమంగా అందించినప్పుడే పిల్లలలో మానసిక ఎదుగుదల, మొదటి 5సవంత్సరాలలో మానసిక, శారీరక ఎదుగుల ఉంటుందని, ఆరోగ్య సమస్యలను వచ్చేవాటిపై చర్యలు తీసుకోవాలని, పిల్లలకు అందించే బాలామృతం, కోడిగుడ్లు అందిం చడంలో నిర్లక్ష్యం వ్యవహరించరాదని సూచించారు. పిల్లల అనారోగ్యానికి గురికాకుండా చూడాలన్నారు. ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయాలని, కేంద్రాల ద్వారా ఇచ్చే సరుకులు వారు ఏ విధంగా వాడుతున్నారన్న విషయాలపై దృష్టి సారించాలని అన్నారు. మాల్‌న్యూ ట్రిషన్ ఇతర లైన్ శాఖలు సమన్వయంతో పనిచేయా లని, తెలియచేసారు. అంగన్‌వాడీ ఆయా నుంచి అధి కారి వరకు అందరు ప్రతి పనిని బాధ్యతగా వ్యవహ రించి కలిసికట్టుగా పనిచేసినప్పుడే శాఖాపరంగా అభి వృద్ధిని సాధించగలుగుతామన్నారు. సిబ్బంది సక్రమం గా పని చేయని లేని యెడల వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంగన్‌వాడీ కేంద్రా లు బాగా పనిచేస్తేనే డిపార్ట్‌మెంట్ ప్రగతిని సాధించ గలుగుతామని అన్నారు. పోషణలోపం 0శాతంగా ఉన్నప్పుడే ప్రగ తిలో వనం ఉన్నట్లుగా గుర్తించడం జరుగుతుందని, పర్యవేక్షణ సరిగా లేకపోడం, పనులపై నిర్లక్యంగా వ్యవహరించడం లాంటవి లేకుండా చూడాలని, మీ కేంద్రం పరిదిలో పోషణ లోపం 0 శాతం గా ఉండేలా చూసులకోవాలని పేర్కోన్నారు. 50 నూతన అంగ న్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణ పనులు తోరగా పూర్తి చేసి వాటిని వాడుకలోకి తీసుకొని రావాలని ఈఈ పీఆర్‌ని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఈ.ఈ. పీఆర్ సుదర్శన్‌రెడ్డి, సీడీపీవోలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, తదిత రులు పాల్గొన్నారు.