Share News

శివ్వారం బ్రిడ్జితో ప్రయోజనం లేదు

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:00 AM

మంథని-శివ్వారం మధ్య నిర్మించ తలపెట్టిన బ్రిడ్జితో నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. మంగళవారం మంథని తీరంలో బ్రిడ్జి నిర్మాణ స్థలంలో పుట్ట మధు విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే బంధువర్గ ప్రయోజ నాల కోసమే రూ.300 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టార న్నారు.

శివ్వారం బ్రిడ్జితో ప్రయోజనం లేదు

మంథని, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): మంథని-శివ్వారం మధ్య నిర్మించ తలపెట్టిన బ్రిడ్జితో నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. మంగళవారం మంథని తీరంలో బ్రిడ్జి నిర్మాణ స్థలంలో పుట్ట మధు విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే బంధువర్గ ప్రయోజ నాల కోసమే రూ.300 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టార న్నారు. మున్సిపాల్సిటీ పరిధిలోని కూచిరాజ్‌పల్లిలో ఎమ్మెల్యే బంధువైన సీఎల్‌ రాజంకు 50 ఎకరాల భూములున్నాయని, రియల్‌ ఎస్టేట్‌లో వాటి ధరలు పెంచడానికి ఈబ్రిడ్జి నిర్మాణం చేపట్టారన్నారు. ఈబ్రిడ్జి రోడ్‌ కూచిరాజ్‌పల్లి వద్దనే ప్రధాన రహ దారికి కలుస్తుందన్నారు. ఎక్కడ హైవేకు కనెక్ట్‌ లేదన్నారు. తమ ప్రభుత్వంలోనే కేసీఆర్‌ సిరిపురం వద్ద నదిపై బ్రిడ్జి నిర్మించడంతో మంచిర్యాల, చెన్నూరు ప్రాంతాలకు రాకపోకలు కొనసాగుతున్నా యన్నారు.

ఈప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి ఆరెంద వద్ద మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఆరేళ్ళ క్రితమే ప్రతిపాదనలు చేశామన్నారు. అడవిసోమన్‌పల్లి వద్ద నిర్మించిన బ్రిడ్జి ప్రస్తుతం శిథిలావస్థకు చేరిందన్నారు. బోయినిపేట, గొల్లగూడెం, కూచిరాజ్‌ పల్లి వాసులకు మేలు కలిగే విధంగా రింగ్‌ రోడ్‌, ఆరెంద వద్ద బ్రిడ్జిని నిర్మించాలన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఏగోళపు శంకర్‌గౌడ్‌, శంకర్‌లాల్‌, గొబ్బూరి వంశీ, జంజర్ల శేఖర్‌, వేల్పుల గట్టయ్య, కనవేన శ్రీనివాస్‌, ఆసీఫ్‌, సమ్మయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 12:00 AM