మహాత్ములు చూపిన బాటలో పయనించాలి
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:33 AM
మహానీయులు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయం లైబ్రరీ ఆడిటోరియంలో మహనీయుల జయంత్యుత్సవాల సందర్భంగా వారి చిత్రపటాలకు పూల మాల వేసి ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్య ప్రాధాన్యంతోనే దేశంలో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు.

గణేష్‌నగర్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): మహానీయులు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయం లైబ్రరీ ఆడిటోరియంలో మహనీయుల జయంత్యుత్సవాల సందర్భంగా వారి చిత్రపటాలకు పూల మాల వేసి ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్య ప్రాధాన్యంతోనే దేశంలో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. మహాత్మాఫూలే మహిళల హక్కులు, విద్య కోసం పోరాటం చేశారన్నారు. అంబేద్కర్ దేశాభివృద్ధికి, బాబు జగ్జీవన్‌రామ్ దేశ ప్రజలకు సౌకర్యాలు అందే విధంగా కృషి చేశారన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఉమేష్‌కుమార్, గంగాధర ఎంపీడీవో దాముని రాము, బుర్ర మధుసూదన్‌రెడ్డి, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య రవికుమార్ జాస్తి, డాక్టర్ హరికాంత్, పద్మావతి, ఉమేరా తస్లీమ్, సరసిజ, ఆచార్య సూరేపల్లి సుజాత, జయంతి, అబ్రరూల్‌బకి, ఆచార్య వరప్రసాద్, రంగప్రసాద్, శ్రీవాణి, మునావర్, జోసఫ్ పాల్గొన్నారు.