మహిళా సాధికారతే లక్ష్యం
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:54 AM
మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేస్తూ మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మోవో సొసైటీ సహకారంతో మండలంలోని దుర్గాబాయి దేశ్‌ముక్ మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళలకు ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్‌లో శిక్షణను ఆయన ప్రారంభించారు.

- ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
-- మహిళా ప్రాంగణంలో ఈ ఆటో డ్రైవింగ్ శిక్షణ ప్రారంభం
తిమ్మాపూర్, ఏప్రిల్ 12, (ఆంధ్రజ్యోతి): మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేస్తూ మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మోవో సొసైటీ సహకారంతో మండలంలోని దుర్గాబాయి దేశ్‌ముక్ మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళలకు ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్‌లో శిక్షణను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పమని తెలిపారు. ఈ ఆటో డ్రైవింగ్‌లో మహిళలకు శిక్షణ ఇచ్చి వారికి ఆటో కొనుగోలు కోసం పెట్టుబడి సాయం చేస్తామన్నారు. రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్ శోభారాణి మాట్లాడుతూ మహిళలు విభిన్న రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో డ్రైవింగ్‌లో శిక్షణ ప్రారంభించామని తెలిపారు. రానున్న రోజుల్లో మొబైల్, టీవీ, మోటార్ రంగంలోనూ మహిళలకు శిక్షణ ఇస్తామన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు కల్పిస్తామన్నారు. మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. అనంతరం మహిళా ప్రాంగణంలో వివిధ శిక్షణలు పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పితి ఈ ఆటో నడపగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర మహిళా కార్పోరేషన్ చైర్ పర్సన్ శోభారాణి ఆటోలో కూర్చుని కొద్ది దూరం వెళ్లారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, మోవో సంస్ధ ప్రతినిధి జైభారతి, జిల్లా సంక్షేమ అధికారి సబిత, మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ సుధారాణి, సీఐ శ్రీలత, జీఎం సుభద్ర పాల్గొన్నారు.