Khammam: మహిళను దారుణంగా కొట్టి.. కారులో ఎక్కించుకుని పోయి.. బాబోయ్..
ABN , Publish Date - Mar 23 , 2025 | 11:43 AM
ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గుర్తుతెలియని ఇద్దరు దుండగులు మహిళపై దాడి చేసి కిడ్నాప్ చేశారు.

ఖమ్మం: జిల్లాలో మహిళ కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. పెనుబల్లి మండలం గౌరారం టోల్ ప్లాజా వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను అపహరించారు. ఇద్దరు వ్యక్తులు మహిళపై దాడి చేసి బలవంతంగా కారులో ఎక్కించుకుని పరారయ్యారు. మార్చి 21న ఉదయం 11 గంటల సమయంలో జరిగిన కిడ్నాప్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టోల్ ప్లాజా వద్ద సీసీ కెమెరాలో కిడ్నాప్ దృశ్యాలు రికార్డయ్యాయి.
అయితే ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు అపహరణకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో అవి ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. అయితే నిందితులు ఎవరు, మహిళను ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఆమె ప్రాణాలతోనే ఉందా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పోలీసులు తక్షణమే కిడ్నాపర్లను పట్టుకుని మహిళను రక్షించాలని కోరుతున్నారు. మరోవైపు మహిళలు, చిన్నారులపై దాడులు పెరిగిపోతున్నాయంటూ ప్రజాసంఘాల నాయకులు మండిపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: వాహనదారులకు అలర్ట్.. ఈ మార్గం గుండా వెళ్తే చుక్కలే..
Shahid Diwas: ఘనంగా అమరవీరుల దినోత్సవం.. ఆ ముగ్గురినీ స్మరించుకుంటూ..