Share News

వైభవంగా శోభాయాత్ర

ABN , Publish Date - Apr 12 , 2025 | 11:21 PM

హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని విశ్వహిందూ పరిషత్‌, బజ రంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వ హించిన శోభాయాత్ర జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని పట్టణ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగింది.

వైభవంగా శోభాయాత్ర
శోభాయాత్రలో జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సరిత, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, నాయకులు

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

గద్వాల టౌన్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి) : చైత్రశుద్ధ పౌర్ణమి, హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని విశ్వహిందూ పరిషత్‌, బజ రంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వ హించిన శోభాయాత్ర జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని పట్టణ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగింది. శోభాయాత్రను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రారంభించి యాత్రలో వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ నాయకులతో కలిసి నడిచారు. అనంతరం యాత్రను దర్శించుకున్న జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సరిత, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బీఎస్‌ కేశవులు పు రవీధుల్లో సాగిన యాత్రలో పాల్గొని భక్తుల ను ఉత్తేజపరిచారు. శోభాయాత్ర ఆసాంతం ముందుండి నడిచిన వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ నాయకులు భక్తులకు అభివారం చేస్తూ శోభా యాత్ర కన్నువ పండువలా సాగేలా బాధ్యత లు నిర్వహించారు. యాత్రలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్ధారెడ్డి, మాజీ అధ్యక్షుడు రామ చంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షురాలు జయశ్రీ, నాయకులు రామచంద్రారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, బండల పాండు, చిత్తారి కిరణ్‌ పాల్గొని భక్తు లకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక కోట ఆ ల యం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర పట్టణ ప్రధాన రహదారుల్లో సాగింది.

Updated Date - Apr 12 , 2025 | 11:21 PM