Share News

మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి

ABN , Publish Date - Apr 03 , 2025 | 11:09 PM

షుగర్‌ వ్యాధి బారిన పడకుం డా శారీరక శ్రమ చేస్తూ, మా నసిక ఒత్తిడికి దూరంగా ఉం డాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరే ట్‌లో డయాబెటిస్‌ అవగాహన కరపత్రాలను విడుదల చేశారు.

మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి
కరపత్రాలు విడుదల చేస్తున్న కలెక్టర్‌, డీఎంహెచ్‌వో

- కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తి వైద్యవిభాగం, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): షుగర్‌ వ్యాధి బారిన పడకుం డా శారీరక శ్రమ చేస్తూ, మా నసిక ఒత్తిడికి దూరంగా ఉం డాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరే ట్‌లో డయాబెటిస్‌ అవగాహన కరపత్రాలను విడుదల చేశారు. అన్ని గ్రామాలకు కరప త్రాలను పంపిణీ చేసి షుగర్‌ వ్యాధిగ్రస్తులతో పాటు వ్యాధి రావడానికి అవకాశం ఉన్న వారం దరికీ కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాల న్నారు. ప్రతి రోజు ఉదయం లేవగానే 30 నిమి షాలు వ్యాయామం, నడక తప్పనిసరిగా చేయా లని, బయటి తిండిని దూరం పెట్టాలన్నారు. డీఎంహెచ్‌వో అల్లే శ్రీనివాసులు, ఎన్‌సీడీ ప్రో గ్రాం అధికారి రామచంద్రరావు, డీపీవో చంద్ర శేఖర్‌, శిరీష, శ్రీనివాస్‌కొండ, అశోక్‌, మధుకర్‌ తదితరులు పాల్గొన్నారు.

విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య

వనపర్తి రాజీవ్‌ చౌరస్తా: పోరాట యోధు డు దొడ్డి కొమురయ్య అని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో దొడ్డి కొమురయ్య జయంతిని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అదనపు కలె క్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య హాజరై దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో ఏవో భాను ప్రకాశ్‌, అధికారులు పాల్గొన్నారు.

శ్రీరంగాపూర్‌: పేదలకు నాణ్యమైన సన్న బియ్యం అందించాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యం పంపి ణీ ప్రారంభించిందని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రెం డవ నెంబర్‌ రేషన్‌ దుకాణాన్ని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి సం దర్శించి, రేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు.

Updated Date - Apr 03 , 2025 | 11:09 PM