Share News

డీపీఆర్‌ తయారీపై కమిషనర్‌ సమావేశం

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:16 PM

నూతనంగా ఏర్పడ్డ మద్దూర్‌ మునిసి పాలిటీ అభివృద్ధిపై ఎన్‌సీపీ కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్‌ తయారు చేసేందుకు గాను స్థానిక నాయకులతో సోమ వారం మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీకా త్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

డీపీఆర్‌ తయారీపై కమిషనర్‌ సమావేశం
మునిసిపాలిటీ డీపీఆర్‌ తయారుపై పరిషత్‌ కార్యాలయంలో సమావేశమైన నాయకులు, అధికారులు

మద్దూర్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): నూతనంగా ఏర్పడ్డ మద్దూర్‌ మునిసి పాలిటీ అభివృద్ధిపై ఎన్‌సీపీ కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్‌ తయారు చేసేందుకు గాను స్థానిక నాయకులతో సోమ వారం మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీకా త్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మునిసిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి ప నులతో డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీ ఆర్‌)ను ఎస్‌సీపీ సంస్థ తయారు చేస్తుందన్నారు. ఆ రిపోర్టు ఆధారంగా మునిసిపాలిటీలో అభివృద్ధి పనులు చేపడతామని కమిషనర్‌ వివ రించారు. ఈ విషయంపై స్థానిక నాయకులు సలహాలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో మునిసిపల్‌ ఏఈ మహేష్‌, అధికారి రామునాయక్‌, మద్దూర్‌ మాజీ ఎంపీపీ సంజీవ్‌, కాంగ్రెస్‌ మండల నాయకులు వీరేశ్‌గౌడ్‌, అశోక్‌గౌడ్‌, బాబు, మల్లికార్జున్‌గణప, శ్రీనివాస్‌, యాసీన్‌, చందు, విజయ్‌, గోవిందు తదితరులున్నారు.

Updated Date - Apr 07 , 2025 | 11:16 PM