Share News

మద్దూర్‌లో భారీ వర్షం

ABN , Publish Date - Apr 03 , 2025 | 11:01 PM

మద్దూర్‌లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.

మద్దూర్‌లో భారీ వర్షం
సంతలో గుడారం కింద తలదాచుకున్న వినియోగదారులు

- సంతలో వరదకు కొట్టుకుపోయిన కూరగాయలు

- అరగంటకు పైగా కురిసిన వర్షంతో జనజీవనం అతలాకుతలం

మద్దూర్‌/కోస్గి/గుండుమాల్‌/కొత్తపల్లి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): మద్దూర్‌లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గురువారం జరిగిన సంతలో వర్షపు నీటిలో కూరగాయలు, ఇతర సామగ్రి కొట్టుకుపోయాయి. దీంతో సంతకు వచ్చిన వినియోగదారులు, వ్యాపా రులు తీవ్ర ఇబ్బందికి గురైయ్యారు. వర్షం నుంచి కాపాడుకోవడానికి సంతలో వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న గుడారాల్లో తలదాచుకున్నా రు. అలాగే కోస్గి, గుండుమాల్‌లో కూడా కురిసిన భారీ వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికాగా, కొత్తపల్లి మండలంలో గాలిదుమారం వీచడంతో పాటు అక్కడక్కడా చినుకులు పడ్డాయి.

Updated Date - Apr 03 , 2025 | 11:01 PM