మెగా వైద్యశిబిరం విజయవంతం చేయాలి
ABN , Publish Date - Mar 14 , 2025 | 11:21 PM
మండలంలో ఆదివారం నిర్వహించనున్న మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని కాం గ్రెస్ మండల జనరల్ సెక్రెటరీ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

గోపాల్‌పేట, మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : మండలంలో ఆదివారం నిర్వహించనున్న మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని కాం గ్రెస్ మండల జనరల్ సెక్రెటరీ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లెల మాధవరెడ్డి జ్ఞాపకార్థ వారి సహోదరుడు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, జిల్లెల ఆదిత్య రెడ్డి వారి ఆధ్వర్యంలో ఆదివారం మండ ల కేంద్రంలోని బాలుర హైస్కూల్‌లో నిర్వహి స్తున్న వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాల ని కోరారు. శిబిరంలో అన్ని రకాలకు సంబంధిం చిన వ్యాధులకు సంబంధించిన, చిన్న పిల్లలకు వైద్యులు ఉంటారని తెలిపారు. రోగులకు, వారి వెంట వచ్చే వారికి మధ్యా హ్నం భోజన వసతి ఏర్పాటు చేసినట్లు వివరిం చారు.