-
-
Home » Andhra Pradesh » Today Breaking News Telangana and AP Assembly Budget Sessions Janasena Foundation Day Highlights Live Updates in Telugu News Saturday 15th March 2025 Amar
-

Breaking News: వాయిదా పడిన తెలంగాణ శాసనసభ..
ABN , First Publish Date - Mar 15 , 2025 | 09:20 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-03-15T16:21:13+05:30
వాయిదా పడిన తెలంగాణ శాసనసభ..
తెలంగాణ శాసనసభ వాయిదా పడింది.
సోమవారం తిరిగి ప్రారంభం కానుంది.
-
2025-03-15T15:15:34+05:30
పెన్షన్లపై ఇదే నా ఛాలెంజ్: సీఎం చంద్రబాబు..
టీడీపీ కుటుంబసభ్యులను పైకి తీసుకురావాలని అనుకుంటున్నా: సీఎం చంద్రబాబు
అందుకు ఏం చేయాలనే దానిపై ఆలోచనలు చేస్తున్నా: సీఎం చంద్రబాబు
పార్టీ సభ్యులు ఆఫీసుకి వస్తే సొంత బంధువుల్లాగా చూసే పార్టీ టీడీపీనే: సీఎం చంద్రబాబు
వారికి అల్పాహారం, విందు ఇచ్చి పంపించే పార్టీ ఒక్క టీడీపీయే : సీఎం చంద్రబాబు
36 ఏళ్ల క్రితం రాజకీయం మీద మా కుటుంబం ఆధారపడకూడదని అనుకున్నాం: సీఎం చంద్రబాబు
అందుకే హెరిటేజ్ ఫ్యాక్టరీ ప్రారంభించాం, 33 ఏళ్లగా అది రన్ అవుతోంది: సీఎం చంద్రబాబు
ఈరోజు నా కుటుంబసభ్యులు, నా మీద ఆధారపడరు: సీఎం చంద్రబాబు
పైసా ఖర్చు లేకుండా ల్యాండ్ పూలింగ్ విధానం టీడీపీ ప్రవేశపెట్టింది: సీఎం చంద్రబాబు
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ల్యాండ్ పూలింగ్ విధానం తెచ్చింది టీడీపీయే: చంద్రబాబు
దేశంలో రూ.33 వేల కోట్ల పెన్షన్లు ఆంధ్రప్రదేశ్ తప్ప ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు: సీఎం చంద్రబాబు
రూ.4 వేల పెన్షన్ ఏ రాష్ట్రం అయినా ఇస్తుందా అని ఛాలెంజ్ చేసి అడుగుతున్నా: సీఎం చంద్రబాబు
-
2025-03-15T15:06:12+05:30
వరంగల్ చౌరస్తాలో దారుణ ఘటన
వరంగల్: వరంగల్ చౌరస్తాలో వెలుగు చూసిన దారుణ ఘటన
బ్యాంకు వేధింపులు తాళలేక పెట్రోల్ పోసుకుని కుటుంబం ఆత్మహత్యాయత్నం
బాధితులను చిలుకూరి క్లాత్ స్టోర్ బ్రదర్స్ కుటుంబ సభ్యులుగా గుర్తింపు
దుకాణం ఎదుటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన బాధితులు
మంటల్లో కాలిపోతూ ఆర్తనాదాలు చేసిన చిలుకూరి కుటుంబ సభ్యులు
మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించిన స్థానికులు, ఇద్దరి పరిస్థితి విషమం
ఘటనపై కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్న పోలీసులు
-
2025-03-15T14:56:38+05:30
దుబాయ్ చిట్టా మెుత్తం మా దగ్గర ఉంది: సీఎం రేవంత్..
జన్వాడ ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీలో దొరికిందెవరు?: రేవంత్
కోళ్ల పందాలతో ఫామ్‌హౌస్‌లో ఎవరు దొరికారు?: రేవంత్
దుబాయ్‌లో డ్రగ్స్ తీసుకుని చనిపోయిన వ్యక్తి ఎవరి మిత్రుడు?: రేవంత్
అతని మృతదేహాన్ని ఇక్కడకు తీసుకురాకుండా దహనం చేయించిన చరిత్ర ఎవరిది?: రేవంత్
ఫామ్‌హౌస్‌ల్లో డ్రగ్స్, క్యాసినో, కోళ్ల పందాలు క్షమించం: రేవంత్
దుబాయ్ నుంచి మొత్తం రికార్డులు తెప్పించాం: రేవంత్
వాళ్లు సభకు వచ్చినప్పుడు అన్నీ బయటపెడతాం: రేవంత్
ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసు: రేవంత్
మొత్తం వివరాలు సభ ఎదుట ఉంచుతాం: సీఎం రేవంత్
-
2025-03-15T14:53:59+05:30
జర్నలిస్టులకు ప్రత్యేక చట్టాలు తేస్తాం: సీఎం రేవంత్..
జర్నలిస్టుల ముసుగులో అసాంఘిక భాష వాడితే ఊరుకునేది లేదు: రేవంత్
ఇలాంటి భాషా ప్రయోగాన్ని ఎప్పుడైనా చూశామా?: రేవంత్
నోటికి వచ్చింది మాట్లాడి పైశాచిక ఆనందం పొందుతున్నారు: రేవంత్
జర్నలిస్టులకు విధివిధానాలు రూపొందిస్తాం: సీఎం రేవంత్
అవసరమైతే ప్రత్యేక చట్టాలు తయారుచేస్తాం: రేవంత్
ఆత్మగౌరవం చంపుకుని దిగజారుడు రాజకీయాలు చేయం: రేవంత్
తెలంగాణలో ఇలాంటి సంప్రదాయం ఎప్పుడైనా ఉందా?: రేవంత్
భవిష్యత్‌లో ఇలాగే మాట్లాడితే ఎవరినీ వదిలిపెట్టేది లేదు: రేవంత్
-
2025-03-15T14:47:10+05:30
కేసీఆర్ ఇకనైనా నీ పిల్లలను అదుపులో పెట్టుకో: రేవంత్
తెలంగాణ యువతకు నాపై కోపం ఉంటుందని కొంతమంది అంటున్నారు: సీఎం రేవంత్
ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన నాపై కోపం ఉంటుందా?: సీఎం రేవంత్
డీఎస్సీ, గ్రూప్-1, స్కిల్ వర్సిటీ పెట్టినందుకు కోపం ఉంటుందా?: సీఎం రేవంత్
రుణమాఫీ చేసినందుకు రైతులకు నాపై కోపం ఉంటుందా?: రేవంత్
రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చినందుకు నాపై కోపం ఉంటుందా?: సీఎం రేవంత్
పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారు: సీఎం రేవంత్
ఆడబిడ్డల గురించి అసభ్యకర పోస్టులు పెడితే ఊరుకునేది లేదు: రేవంత్
హద్దులు దాటి మాట జారితే ఫలితం మరోలా ఉంటుంది: రేవంత్
నాపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.. ఇది సరైనదేనా?: సీఎం రేవంత్
ఏదిపడితే అది మాట్లాడితే ఇకపై ఊరుకునేది లేదు: సీఎం రేవంత్
నా కుటుంబ సభ్యులపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు: రేవంత్
కేసీఆర్ ఇకనైనా నీ పిల్లలను అదుపులో పెట్టుకో: రేవంత్
-
2025-03-15T14:44:56+05:30
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు?: సీఎం రేవంత్
సమగ్ర కుటుంబ సర్వేను సభలో పెడతాం: సీఎం రేవంత్
ఎవరితో పడితే వారితో సర్వే చేయించలేదు: రేవంత్
ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌తో పక్కాగా కులగణన చేశాం: రేవంత్
కొందరు వివరాలు ఇవ్వలేదనే రెండోసారి సర్వే: రేవంత్
సర్వేను ఓన్ చేసుకునే ధైర్యం బీఆర్ఎస్‍కు ఉందా?: రేవంత్
గద్దర్, గూడ అంజన్న వంటివారిని బీఆర్ఎస్ అవమానించింది: రేవంత్
జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంలా ఎందుకు గుర్తించలేదు?: సీఎం రేవంత్
పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఎందుకు పెట్టలేదు?: సీఎం రేవంత్
-
2025-03-15T14:42:46+05:30
వారే నా బాస్: సీఎం రేవంత్ రెడ్డి..
ప్రజలే మాకు బాస్‌లు.. వారికే నేను జవాబుదారీ: రేవంత్
కేసీఆర్‌కు ఉన్నంత వయసు, అనుభవం నాకు లేవు: రేవంత్
కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్ని అంశాలూ చర్చిస్తా: రేవంత్
ఫామ్‌హౌస్‌లో దాక్కున్న కేసీఆర్‌ను బయటకు రప్పించే శక్తి మాకు ఉంది: రేవంత్
అప్పులు పెండింగ్ పెట్టిందే కాకుండా తిరిగి మాపైనే విమర్శలు చేస్తున్నారు: సీఎం రేవంత్
డిస్కంలు, సింగరేణి, కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ పెట్టారు: రేవంత్
-
2025-03-15T14:40:57+05:30
తెలంగాణ అప్పులపై సీఎం రేవంత్ ఏమన్నారంటే..
గత ప్రభుత్వం మాకు రూ.8.19 లక్షల కోట్ల అప్పులు ఇచ్చి వెళ్లారు: రేవంత్
మేం చేసిన అప్పు రూ.1.58 లక్షల కోట్లు మాత్రమే: రేవంత్
అప్పులు పెండింగ్ పెట్టి పారిపోతే మేం కడుతున్నాం: రేవంత్
కేసీఆర్ చేసిన అప్పులపై అసలు, వడ్డీ కలిపి రూ.1.53 లక్షల కోట్లు చెల్లించాం: రేవంత్
ప్రస్తుతం తెలంగాణ అప్పు రూ.7.38 లక్షల కోట్లు: రేవంత్
బీఆర్ఎస్ పాలనలో తప్పులు, అప్పులు మాత్రమే చేశారు: రేవంత్
అబద్ధాల పునాదులపై మేం పరిపాలన చేయబోం: రేవంత్
-
2025-03-15T14:37:56+05:30
కమీషన్లకు కక్కుర్తిపడ్డారు: సీఎం రేవంత్ రెడ్డి..
గతంలో చెరువులు, కుంటలను మాయం చేశారు: రేవంత్
అపార్టుమెంట్లకు తగిన డ్రెయినేజీ వ్యవస్థ ఉందా?: రేవంత్
కమీషన్లు తీసుకుని నగరాన్ని సర్వనాశనం చేశారు: రేవంత్
లెక్కలేకుండా అనుమతులు ఇచ్చి గందరగోళం చేశారు: రేవంత్
ఎలక్ట్రిక్ వాహనాలకు మేం జీరో పన్ను చేశాం: రేవంత్
ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేశాం: రేవంత్
ప్రపంచ స్థాయి నగరంలా మార్చాలని చూస్తుంటే అడ్డం పడుతున్నారు..
పరిశ్రమలు తీసుకురావాలని చూస్తుంటే అడ్డుపడుతున్నారు: రేవంత్
కేసీఆర్ సలహాలు, సూచనలు ఇస్తే తీసుకుంటాం: రేవంత్
అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన చెప్పినవి పాటిస్తాం: రేవంత్
-
2025-03-15T14:33:29+05:30
ఢిల్లీ పర్యటనలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
15 నెలల్లో 32 సార్లు ఢిల్లీ వెళ్లా: రేవంత్
అవసరమైతే మరో 300 సార్లు వెళ్తా: రేవంత్
కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాలి: రేవంత్
దేశ ప్రధానిని గౌరవించే విజ్ఞత నాకుంది: రేవంత్
దేశ ప్రధాని ఏ రాష్ట్రానికైనా పెద్దన్న లాంటివారే: రేవంత్
ఇందులో రాజకీయం ఏముంటుంది?: రేవంత్
BRS నేతల్లా నేను చీకట్లో ఎవరి కాళ్లూ పట్టుకోలేదు: రేవంత్
RRR సహా అనేక ప్రాజెక్టులు, అనుమతులు తీసుకొచ్చా: రేవంత్
కేంద్రం ఇవ్వని ప్రాజెక్టులపై పోరాటం చేస్తున్నాం: రేవంత్
ఢిల్లీలో నేను కలవని కేంద్రమంత్రి లేరు: రేవంత్
కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ను కూడా కలిశా: రేవంత్
-
2025-03-15T13:45:10+05:30
మోదీ పెద్దనన్ననే.. కుండ బద్దలు కొట్టిన సీఎం రేవంత్
ప్రధాని సీఎంలకు పెద్దన్ననే
అందులో తప్పేముంది
ప్రధాని మోదీని పెద్దన్న అని అన్నాను
సభలో చెబుతున్నా ప్రభుత్వం వేరు, పార్టీలు వేరు
మోదీని 15 నెలల్లో మూడుసార్లు కలిశా
ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులను కలిశా
తెలంగాణ అభివృద్ధి కోసమే కేంద్రమంత్రులను కలుస్తున్నా
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం కోరడంలో తప్పేముంది
కేంద్రం మంచి చేస్తే చేసిందని చెప్పుకోవడంలో తప్పేముంది
మంచి చేస్తే మంచి చేసిందని చెబుతాం
ఢిల్లీ ఎప్పుడు వెళ్లినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే
ఢిల్లీ ఎప్పుడూ వెళ్లినా సామన్య ప్రజలు ప్రయాణించే కమర్షియల్ ఫ్లైట్‌లో టికెట్ తీసుకుని వెళ్లా
ఒకట్రెండుసార్లు మాత్రమే చార్టర్ ఫ్లైట్‌లో వెళ్లా
కేసీఆర్‌లా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయలేదు
-
2025-03-15T13:25:50+05:30
వరంగల్‌లో ఉద్రిక్తత
గీసుకొండ మండలం కొమ్మాల జాతరలో ఉద్రిక్తత
స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, కొండా మురళీ వర్గీయుల మధ్య ఘర్షణ
పోలీసుల లాఠీఛార్జ్, కొనసాగుతున్న ఉద్రిక్తత
-
2025-03-15T13:19:54+05:30
కేసీఆర్‌పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రోజా ఇంటికి వెళ్లి రొయ్యల పులుసు తిన్నది ఎవరు
ఒక్కసారి రొయ్యల పులుసు పెడితేనే రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నారు
గుండెల్లో పెట్టుకుని మహబూబ్‌నగర్ ప్రజలు రాజకీయ భిక్ష పెడితే మా గుండెల మీద తంతారా
నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు ఏపీ పోలీసులు వచ్చి మన వాళ్లను కొట్టి వెళ్తే పౌరుషం లేకుండా ఫామ్ హౌజ్‌లో పడుకున్నారు.
ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే పైశాచిక ఆనందం పొందుతున్నారు
మామ, అల్లుడు, కొడుకు డ్యాన్స్ లు చేస్తున్నారు
గుండు సున్నా ఇచ్చినా ఆత్మ విమర్శ చేసుకోకుండా ప్రజలను తిడుతున్నారు
మీకు స్టేచర్ పట్ల ఉన్న ఆలోచన స్టేట్ ఫ్యూచర్ మీద లేదా
నేను ఏం తప్పు మాట్లాడాను.. బిఆర్ఎస్ నేడు మార్చురీలో ఉన్నదని చెప్పా
కానీ నేను కేసిఆర్ ను అన్నట్లు ప్రచారం చేస్తున్నారు
-
2025-03-15T12:53:42+05:30
నేను కేసీఆర్‌ను అలా అనలేదు..
కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా
కేసీఆర్ చెడును నేనెందుకు కోరుకుంటా
ఏదైనా కోరుకుంటే వాళ్ల కుటుంబ సభ్యులే కోరుకుంటారు
కేసీఆర్ సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో ఉండాలనే కోరుకుంటున్నా
మేము అధికారపక్షంలోనే ఉంటాము
-
2025-03-15T12:49:17+05:30
శాసనసభలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం ఉందని భావించి సెక్యూరిటీ పెట్టించుకుని ఉండొచ్చు
-
2025-03-15T10:53:55+05:30
పల్లాకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రూ.2లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేశామన్న మంత్రి
ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ రుణమాఫీ చేస్తున్నాం
రైతులకు ఏమి చేయలేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పడం అవాస్తవమన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
-
2025-03-15T10:48:51+05:30
ముక్కు నేలకు రాస్తా.. శాసనసభలో పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
రైతులకు సాగునీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్న పల్లా
ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
తాను చెప్పిన అంశాలు తప్పులని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి
ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదు
-
2025-03-15T10:22:02+05:30
తెలంగాణ శాసనసభ ప్రారంభం
శాసనసభ ప్రారంభం కాగానే జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ అంశాన్ని ప్రస్తావించిన హరీష్‌రావు
స్పీకర్ పట్ల అమర్యాదగా ప్రవర్తించలేదన్న హరీష్‌రావు
సస్పెన్షన్ ఎత్తివేసి సభలోకి జగదీశ్వర్ రెడ్డిని అనుమతించాలని కోరిన హరీష్‌రావు
-
2025-03-15T09:20:07+05:30
తెలంగాణలో శాసనసభలో నిరసనకు బీఆర్ఎస్ ప్లాన్
కాసేపట్లో ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించనున్న సీఎం రేవంత్
పలు బిల్లులు సభలో పెట్టే ఛాన్స్
సీఎం కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ సభలో నిరసన తెలపాలని బీఆర్‌ఎస్ నిర్ణయం