ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:08 PM
ధాన్యం కొనుగో లు సమయంలో నిబంధనలు పాటి స్తూ, రైతులకు ఇబ్బందులు కలగ కుండా చూడాలని జిల్లా వ్యవసా య అధికారి గోవింద్ నాయక్, జి ల్లా సివిల్ సప్లయ్ అధికారి విశ్వనాథం సూచిం చారు.

- జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్
వనపర్తి రూరల్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగో లు సమయంలో నిబంధనలు పాటి స్తూ, రైతులకు ఇబ్బందులు కలగ కుండా చూడాలని జిల్లా వ్యవసా య అధికారి గోవింద్ నాయక్, జి ల్లా సివిల్ సప్లయ్ అధికారి విశ్వనాథం సూచిం చారు. గురువారం మండలంలోని నాగవరం రైతు వేదికలో వనపర్తి, పెద్దమందడి, ఖిల్లాఘ ణపురం, పాన్‌గల్ మండలాల వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ ఏర్పాటు చేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తే మ 14-17 శాతం, చెత్త, తాలు ఒక శాతం, మ ట్టి పెళ్లలు ఒక శాతం, చెడిపోయిన, రంగు మా రిన గింజలు ఐదు శాతం, పూర్తిగా తయారు కానీ గింజలు మూడు శాతం లోపు ఉండాల న్నారు. అటువంటి వాటినే కొనుగోలు చేయాల ని అన్నారు. సన్న రకాలకు, దొడ్డు రకాలకు వి డిగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తెలిపారు. సన్న రకాలకు మద్ధతు ధరతో పాటు బోనస్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సరిపడి నన్ని టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచు కోవాలన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ జగన్, మహిత, చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.
నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి
మదనాపురం: కొనుగోలు కేంద్రం నిర్వాహ కులు ధాన్యంలో నాణ్యతా ప్రమాణాలు పాటిం చాలని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నా యక్ అన్నారు. గురువారం మండల కేంద్రం లోని రైతువేదికలో మదనాపురం, కొత్తకోట, ఆత్మకూర్, అమరచింత మండలాలకు సంబం ధించిన కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.