Share News

కనుల పండువగా శోభాయాత్ర

ABN , Publish Date - Apr 12 , 2025 | 11:31 PM

హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని శనివారం రాత్రి నారాయణపేటలో వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో హనుమాన్‌ శోభాయాత్ర కనుల పండువగా కొనసాగింది.

కనుల పండువగా శోభాయాత్ర
పేటలో హనుమాన్‌ శోభాయాత్ర

- జైహనుమాన్‌ నినాదాలతో మారుమోగిన పేట పట్టణం

నారాయణపేట, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని శనివారం రాత్రి నారాయణపేటలో వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో హనుమాన్‌ శోభాయాత్ర కనుల పండువగా కొనసాగింది. శోభాయాత్రలో శ్రీరామ జయరామ జయ జయరామ, పవనసుత హనుమాన్‌కి జై అంటూ భక్తులు నినదించారు. బారంబావి నుంచి హనుమాన్‌ ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించి హనుమాన్‌ చాలీసా పారాయణం అనంతరం శోభా యాత్ర కొనసాగింది. కార్యక్రమంలో రాంబాబు, రాజ్‌కుమార్‌ రెడ్డి, సత్యయాదవ్‌, గందె చంద్రకాంత్‌, అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, మురళీభట్టడ్‌, చెన్నారెడ్డి, నందునామాజీ, వెంకట్రాములు, కన్న శివకుమార్‌, డాక్టర్‌ మదన్‌మోహన్‌రెడ్డి, పోషల్‌ రాజేష్‌, దూస సీతారాము లు, వెంకటయ్య, ప్రసాద్‌శెట్టి, ప్రవీణ్‌, శ్రావణ్‌, వెంకటేష్‌, రవికుమార్‌గౌడ్‌, వెంకటేష్‌ గౌడ్‌, మణిశంకర్‌, శ్రీకాంత్‌, సందీప్‌, కోట్ల రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జ్యూస్‌, నీటి బాటిళ్ల పంపిణీ

చౌక్‌బజార్‌లో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు ఎండీ.సలీం హనుమాన్‌ శోభాయాత్రకు పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. హాజరైన భక్తులకు జ్యూస్‌, నీటి బాటిళ్లు పంపిణీ చే శారు. హిందూముస్లింలు సోదరభావంతో పండుగలు జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో చిట్టెం మాధవరెడ్డి, సరాఫ్‌ నాగరాజ్‌, గం దెచంద్రకాంత్‌, కోట్ల రవీందర్‌రెడ్డి, మధుసూ దన్‌రెడ్డి వెంకుగౌడ్‌, సతీష్‌గౌడ్‌, యూసుఫ్‌తాజ్‌, ముర్తుజా చాంద్‌, అద్నాన్‌, తాజుద్దీన్‌, కుంటిమారి అశోక్‌ తదితరులున్నారు.

Updated Date - Apr 12 , 2025 | 11:31 PM