యువతరం కదిలింది
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:30 PM
గ్రామాభివృద్ధే లక్ష్యంగా యువతరం కదిలింది. పుట్టి పెరిగిన ఊరి రుణం తీర్చుకునేందుకు ముందడుగు వేసింది.

- కలిసికట్టుగా గ్రామాభివృద్ధికి కృషి
- రూ.30 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు
అమ్రాబాద్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి) : గ్రామాభివృద్ధే లక్ష్యంగా యువతరం కదిలింది. పుట్టి పెరిగిన ఊరి రుణం తీర్చుకునేందుకు ముందడుగు వేసింది. నాగర్‌క ర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండలం, కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మొలకమామిడి గ్రామం అచ్చంపేట - మద్దిమడుగు ప్రధాన రహదారికి అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గ్రామంలో పుట్టి పెరిగి, వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్థిర పడిన వారు చేయిచేయి కలిపారు. విలేజ్ డెవలప్‌మెం ట్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. కమిటీ ఆధ్వర్యం లో గత జనవరి 12వ తేదీన గ్రామంలో బహిరంగ సభ నిర్వహించారు. సభకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్ట ర్ వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు అ భివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.
పలు అభివృద్ధి పనులు
విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో రూ.30 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. అందుకు వృత్తి, ఉద్యోగాలు, వాపారాల్లో స్థిరపడిన గ్రామస్థులతో పాటు, దాతలు సహకరిస్తున్నారు. గ్రా మంలో ఆంజనేయస్వామి ఆలయం, ప్రభుత్వ పాఠశా లకు ప్రహరీ, బస్సు షెల్టర్, క్రీడా ప్రాంగణం, ముఖద్వా రం, పార్కు నిర్మాణాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం పాఠశాల ప్రహరీ నిర్మాణం పూర్తి కావచ్చింది. ము ఖద్వారం, బస్‌షెల్టర్, క్రీడా ప్రాంగణం, పార్కు తది తర పనులు పురోగతిలో ఉన్నాయి. ఏప్రిల్ చివరి నాటికి పనులను పూర్తి చేయించనున్నారు. అనంత రం గ్రామంలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమా లు నిర్వహించడంతో పాటు, రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను ఏర్పాటు చేయనున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు.
జన్మభూమి రుణం తీర్చుకోవాలని..
పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలని గ్రామ పె ద్దల సహకారంతో గ్రామా భివృద్ధి కమిటీని (వీడీసీ) ఏర్పాటు చేసుకున్నాం. క మిటీ సభ్యుల సూచన మేరకు అభివృద్ధి పనులకు నిధులను సమీకరించు కొని పనులను చేపట్టాం. ప్రస్తుతం జరుగుతున్న పనులతో పాటు గ్రామంలో గ్రంథాలయం ఏర్పా టు, సీసీ రోడ్ల నిర్మాణాన్ని కూడా ప్రజాప్రతినిధు లు, దాతల సహకారంతో పూర్తి చేయించేందుకు కృషి చేస్తాం.
- బి.జనార్దన్, వీడీసీ అధ్యక్షుడు
గ్రామాభివృద్ధికి తోడ్పడాలని..
అన్ని రంగాల్లో వెనుక బడిన మా గ్రామాన్ని విద్య, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయిం చుకున్నాం. గతంలో మా పూ ర్వీకులు ప్రజల ఉమ్మడి అవస రాల కోసం కొను గోలు చేసిన నాలుగున్నర ఎకరా ల్లో క్రీడా ప్రాంగణం, పార్కు ఒకే దగ్గర ఏర్పాటు చేయనున్నాం. ఇంకా పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నాం.
- బుడిగమల్ల ఓంకార్