ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Prabhakar: ఆ కేసులపై మంత్రి పొన్నం షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Jan 11 , 2025 | 10:30 AM

Minister Ponnam Prabhakar: మెప్మా ద్వారా మహిళలకు సాయమందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గౌరవెల్లి, మిడ్ మానేరు, మల్లన్న సాగర్‌కు సంబంధించిన కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరుతానని చెప్పారు. తన మీద కేసులు ఉన్నాయి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Minister Ponnam Prabhakar

సిద్దిపేట: మహిళలకు తమ ప్రభుత్వం ఆర్థికంగా చేయూత ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వారికి ఆర్థికంగా వెసులుబాటు ఉండే కార్యక్రమాలు చేపడతామని అన్నారు. మహిళలకు ఆర్థిక వృద్ధి సాధించడానికి ఇంట్లో కూర్చుని చేసే పనులు కొన్ని ఉన్నాయని తెలిపారు. సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించి ఆసక్తి ఉన్నవారు శిక్షణ తీసుకోవాలని సూచించారు. మెప్మా ద్వారా మహిళలకు సాయమందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపనలు చేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... ప్రాజెక్ట్‌లోని ముంపు గ్రామాల సమస్యలు ఏమున్నా మార్చి నెల తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం చేస్తానని అది తన బాధ్యత అని చెప్పారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ అభివృద్ధికి శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. గౌరవెల్లి, మిడ్ మానేరు, మల్లన్న సాగర్‌కు సంబంధించిన కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరుతానని చెప్పారు. తన మీద కేసులు ఉన్నాయి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Harish Rao: టికెట్‌ రేట్ల పెంపు ఎవరి కోసం..!

High Court: బెనిఫిట్‌ షోలు రద్దంటూ.. స్పెషల్‌ షోకు అనుమతులా?

HMDA: మహా అప్పు కావాలి!

Read Latest Telangana News and Telangana News

Updated Date - Jan 11 , 2025 | 12:01 PM