Share News

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై దృష్టి పెట్టండి

ABN , Publish Date - Jan 10 , 2025 | 04:11 AM

ఎల్‌ఆర్‌ఎ్‌స(అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం) దరఖాస్తుల పరిష్కారంపై మున్సిపల్‌ కమిషనర్లు దృష్టి సారించాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిషోర్‌ ఆదేశించారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై దృష్టి పెట్టండి

  • మార్చి నెలాఖరుకు ప్రక్రియ పూర్తి కావాలి

  • సమీక్షలో ముఖ్యకార్యదర్శి దానకిషోర్‌

హైదరాబాద్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ఎ్‌స(అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం) దరఖాస్తుల పరిష్కారంపై మున్సిపల్‌ కమిషనర్లు దృష్టి సారించాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిషోర్‌ ఆదేశించారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో గురువారం 142 పురపాలక సంఘాల కమిషనర్లతో ఎల్‌ఆర్‌ఎస్‌, రెవెన్యూ, రెవెన్యూయేతర పన్నుల వసూళ్ల లక్ష్యం, భువన్‌ సర్వే, మెప్మా కార్యకలాపాల ప్రగతి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పెండింగ్‌ దరఖాస్తులను త్వరగా పూర్తి చేసేందుకు క్లియర్‌ పట్టా భూములు ఉండి, అనుమతులు లేని లేఅవుట్‌లను క్రమబద్ధీకరణ చేసేందుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని దానకిషోర్‌ సూచించారు.


ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను పారదర్శకంగా మార్చి నెలాఖరునాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. దరఖాస్తుదారులు భవన నిర్మాణ అనుమతులను తీసుకునేలా ప్రోత్సహించాలని చెప్పారు. భువన్‌ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆస్తిపన్ను, ఇతర పన్నుల వసూళ్లలో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదని, క్షేత్ర స్థాయిలో వీటిపై దృష్టిపెట్టాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌, రెవెన్యూ మేళాలు, ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ మార్చి నెలాఖరులోగా వంద శాతం లక్ష్యాన్ని చేరాలని ఆదేశించారు. మహిళా స్వయం సహాయక సంఘాల్లో అర్హులను చేర్పించాలని ఆదేశించారు. మెప్మా పరిధిలో స్వయ

Updated Date - Jan 10 , 2025 | 04:11 AM