LRS Scheme: ఎల్‌ఆర్‌ఎస్ వెబ్‌సైట్‌లో మార్పులు
ABN , Publish Date - Mar 21 , 2025 | 03:45 AM
పత్రాల అప్‌లోడ్, రుసుం నిర్ధారణలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను సరిదిద్దామని డీటీసీపీ దేవేందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 25 శాతం రాయితీని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకునేలా దరఖాస్తు ప్రాసెసింగ్ విధానంలో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు.

లేఅవుట్ రెగ్యులరైజేషన్ పథకం (ఎల్‌ఆర్‌ఎ్‌స)లో తలెత్తిన సాంకేతిక లోపాలపై ఈ నెల 19న ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఎల్‌ఆర్‌ఎస్ షార్ట్‌ఫాల్ పత్రాలు అప్‌లోడ్ కావట్లే..’ అన్న శీర్షికతో ప్రచురితమైన కథనానికి పురపాలక శాఖ అధికారులు స్పందించారు. పత్రాల అప్‌లోడ్, రుసుం నిర్ధారణలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను సరిదిద్దామని డీటీసీపీ దేవేందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 25 శాతం రాయితీని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకునేలా దరఖాస్తు ప్రాసెసింగ్ విధానంలో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు.
కొత్త విధానంలో దరఖాస్తుదారు తొలుత ఫీజు చెల్లించాక క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం అనుమతుల మంజూరు ఉంటుందని, ఈ మార్పుల వల్ల కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయని, దీంతో వెబ్‌సైట్‌లో సవరణలు చేశామన్నారు. ఫీజు నిర్ధారణలో ఎక్కడైనా వ్యత్యాసం ఉన్నట్లు దరఖాస్తుదారులు గుర్తిస్తే సవరణ చేసే అధికారం సంబంధిత అధికారులకు ఇచ్చినట్లు వివరించారు. సిటిజన్ లాగిన్‌లోనూ దరఖాస్తును ట్రాక్ చేయడం, ఫీజు ఇంటిమేషన్ లేఖ కనిపించేలా మార్పులు చేసినట్లు తెలిపారు.