Share News

ఒక్క రోజులో 110 రిజిస్ట్రేషన్లు

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:57 AM

: తెలంగాణ ప్రభుత్వం లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) అమలులో భాగంగా ఆర్థిక సంవత్సరం చివరి రోజైన సోమవారం ఒక్కరోజే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 110 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.

ఒక్క రోజులో 110 రిజిస్ట్రేషన్లు

చివరి రోజున ఎల్‌ఆర్‌ఎ్‌సకు వచ్చిన దరఖాస్తుదారులు

పండుగ సెలవు ఉన్నా పనిచేసిన ఎస్‌ఆర్‌ కార్యాలయాలు

ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 1,528 డాక్యుమెంట్లు నమోదు

నల్లగొండ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ప్రభుత్వం లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) అమలులో భాగంగా ఆర్థిక సంవత్సరం చివరి రోజైన సోమవారం ఒక్కరోజే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 110 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. రంజాన పండుగ సెలవుదినం అయినప్పటికీ సెలవును రద్దు చేసి సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయం నడిచేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన చేసుకునే వీలు కల్పించడమే కాకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులో 25శాతం రాయితీ కూడా ఇచ్చింది. సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో క్రమబద్ధీకరణ ఫీజులు చెల్లించి రిజిస్ట్రేషన చేసుకుంటే రాయితీ వర్తించేలా ఆదేశాలు ఇచ్చింది.

దీంతో మార్చి 31న సెలవు దినం అయినప్పటికీ ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు కావడంతో సెలవు దినాన్ని పనిదినంగా మార్చి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 15 సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాలతో పాటు జిల్లా రిజిసా్ట్రర్‌ కార్యాలయ అధికారులు హాజరు కావాలని ఆదేశాలు ఇవ్వడంతో సోమవారం సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాలు పనిచేశాయి. అదేవిధంగా బ్యాంకులు కూడా పనిచేశాయి.

ఒక్క నకిరేకల్‌లోనే 48..

మొత్తం 15సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లో సోమవారం 110 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన అయ్యాయి. నకిరేకల్‌ పరిధిలోనే ఎక్కువగా 48 ఎల్‌ఆర్‌ఎస్‌ రిజిస్ట్రేషన పూర్తయ్యాయి. మోత్కూరు, చండూరు, చండూరు, దేవరకొండ, నల్లగొండ సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లో అవకాశం కల్పించినప్పటికీ ఎటువంటి రిజిస్ట్రేషన్లు నమోదు కాలేదు. భువనగిరి కార్యాలయంలో 8, బీబీనగర్‌లో 8, చౌటుప్పల్‌ 5, రామన్నపేటలో 6, యాదగిరిగుట్టలో 8 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన అయ్యాయి. మొత్తంగా ఈ జిల్లాలో 35 ఎల్‌ఆర్‌ఎస్‌ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషనకు నోచుకోగా, నల్లగొండ జిల్లాలో నకిరేకల్‌లో 48, నిడమూరులో 4 మొత్తంగా 52, సూర్యాపేట జిల్లాలో హూజూర్‌నగర్‌, కోదాడలలో ఒక్కొక్కటి చొప్పున, సూర్యాపేటలో 21 ఎల్‌ఆర్‌ఎస్‌ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన అయ్యాయి. మొత్తంగా ఈ జిల్లాలో 23 ఎల్‌ఆర్‌ఎస్‌ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన పూర్తిచేసుకున్నారు.

ఇప్పటి వరకు1,528 రిజిస్ట్రేషన్లు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం ప్రారంభమై న నాటి నుంచి సోమవా రంవరకు 1,528 దరఖాస్తు లు రిజిస్ట్రేషన్లు అయ్యాయి.

కార్యాలయం డాక్యుమెంట్లు

యాదాద్రి జిల్లాలో...

బీబీనగర్‌ 140

చౌటుప్పల్‌ 30

మోత్కూరు 30

రామన్నపేట 44

యాదగిరిగుట్ట 233

నల్లగొండ జిల్లాలో..

చండూరు 23

దేవరకొండ 72

మిర్యాలగూడ 81

నల్లగొండలో 68

నకిరేకల్‌ 113

నిడమూరు 85

సూర్యాపేట జిల్లాలో...

హుజూర్‌నగర్‌ 27

కోదాడ 160

సూర్యాపేట 270

Updated Date - Apr 01 , 2025 | 12:57 AM