ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG NEWS: నాకు ఆ భూమితో సంబంధం లేదు.. బీర్ల అయిలయ్య షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Jan 10 , 2025 | 02:25 PM

Beerla ilaiah: గొంగిడి సునీత మతి స్థిమితం కోల్పోయి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. బీర్ల అయిలయ్య బదులు నీళ్ల అయిలయ్య అని ఆలేరు ప్రజలు తన పేరు మార్చారని అన్నారు. కొలనుపాక ల్యాండ్ ఇష్యూతో తనకు సంబంధం లేదని అన్నారు. తన బినామీలు ఎవరో నిరూపించాలని సవాల్ విసిరారు.

Beerla ilaiah

యాదాద్రి : తనపై మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సవాల్ చేశారు. నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా.? అని ప్రతి సవాల్ విసిరారు. యాదాద్రి జిల్లాలో బీర్ల అయిలయ్య పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో బీర్ల అయిలయ్య మాట్లాడుతూ... గొంగిడి సునీత మతి స్థిమితం కోల్పోయి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. బీర్ల అయిలయ్య బదులు నీళ్ల అయిలయ్య అని ఆలేరు ప్రజలు తన పేరు మార్చారని అన్నారు. కొలనుపాక ల్యాండ్ ఇష్యూతో తనకు సంబంధం లేదని అన్నారు. తన బినామీలు ఎవరో నిరూపించాలని సవాల్ విసిరారు. 150 డాక్యుమెంట్లలో తన అనుచరుల పేర్లలో ఒక్కటి ఉన్నా రాజీనామా చేస్తానని అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ తప్పు చేసిండు కాబట్టే ప్రశ్నించానని అన్నారు. బీసీ ఎమ్మెల్యేను కాబట్టే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే పది రోజుల్లో నిరూపించాలి....బహిరంగ చర్చకు రావాలని అన్నారు. ఎర్రగడ్డకు వెళ్లి చూపించుకో.. రెఫర్ చేస్తానని బీర్ల అయిలయ్య విమర్శించారు.

Updated Date - Jan 10 , 2025 | 02:25 PM