Share News

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించరూ

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:43 AM

కృష్ణానదికి ఆనుకొని ఉన్న పలు తండాలు, గ్రామా ల్లో వేలాది ఎకరాల్లో వరి సాగు చేస్తు న్నప్పటికీ ఈ ప్రాంత రైతులకు మార్కెటింగ్‌ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించడం లేదు. దీంతో కృష్ణపట్టె రైతా ంగం తాము పండించిన ధాన్యానికి మద్దతు ధర పొందలేక నానా అవస్థలు పడుతున్నారు. పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులకు గుర వుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. - (ఆంధ్రజ్యోతి-తిరుమలగిరి(సాగర్‌)

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించరూ

కృష్ణపట్టెలో సుమారు ఎనిమిదేండ్లుగా ఇక్కడి రైతాంగం వరి పంట సాగు పైన ఆసక్తి కనబరుస్తున్నారు. సాగులో మంచి దిగుబడులు సాధిస్తున్నారు. అయితే వారు పండించిన పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులకు గురవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. తలాపున కృష్ణానది పారుతుండడం, సాగర్‌ వెనుక జలాలు తమ పొలాలకు ప్రవహిస్తుండడంతో పరీవాహక ప్రాంత రైతు లు వరిని సాగు చేస్తున్నారు. ఇదే క్రమంలో నదికి సుమారు కిలో మీటర్‌ దూరంలో తమ వ్యవసాయ పొలాలు ఉన్నప్పటికి సొంతంగా లక్ష లాది రూపాయలు వెచ్చించి నది సమీపంలో విద్యుత్‌ మోటార్లను, నీటి పైప్‌లైన్లను ఏర్పాటు చేసుకోని స్వయం కృషితో తమ పొలాలకు కృష్ణా జలాలను పారించుకుంటున్నారు. మండలంలోని చింతలపా లెం, నాయ కునితండా, నాగార్జునపేటతండా, జమ్మనకోట, తి మ్మాయిపాలెం, సపావత్‌తండాతోపాటు సమీపంలోనే గల అడవిదేవులపల్లి మండలానికి చెందిన జాలకోటితండా, సారెగూడెం, నడిగడ్డ తదితర గ్రా మాల్లో కలిపి సుమారు 2వేల ఎకరాలకు పైగా ఈ ప్రాంత రైతులు వరిని సాగు చేసు ్తన్నారు. తద్వారా ఎకరానికి సుమారు 40 బస్తాల చొప్పున ప్రతి సీజన్‌కు సుమారు 2వేల ఎకరాలకు రమారమి 40 నుంచి 50వేల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి సాధిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న కనీస మద్దతు ధర చొప్పున లెక్కిస్తే సుమారు. రూ.10కోట్ల విలువైన ధాన్యాన్ని పండిస్తున్నారు.

మార్కెటింగ్‌ లేక రైతుల అవస్థలు

సుమారు 40నుంచి 50వేల క్వింటాళ్ల ధాన్యాన్ని పండిస్తున్నప్పటికీ కృష్ణపట్టె ప్రాంతంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. దీంతో పంటను అమ్ముకోవడానికి ఇక్కడి రైతులు హాలియా, మిర్యాలగూడలోని రైస్‌ మిల్లుల వద్దకు ధాన్యాన్ని ట్రాక్టర్లపై తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఒక్కో ట్రాక్టర్‌ లోడ్‌కు కిరాయి కోసం సుమారు రూ.5 నుంచి రూ.6వేల ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళా రైస్‌ మిల్లుల వద్ద పెద్ద ఎత్తున ట్రాక్టర్ల క్యూలైన్లు ఉండి రెండు, మూడు రోజుల వరకు ధాన్యం దిగుమతి కాకుంటే ట్రాక్టర్ల కిరాయి తడిసి మోపెడు ఖర్చవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి కృష్ణపట్టె రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు వీలుగా కొనుగోలు కేంద్రాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిందిగా ఇక్కడి రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

మద్దతు ధర పొందలేకపోతున్నాం

కృష్ణపట్టె ప్రాంతంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయక పోవడంతో రైస్‌ మిల్లు ల వద్దకు వెళ్లి వారు చెప్పిన రేటుకు అమ్ముకోవాల్సి వ స్తుంది. దాంతోపాటు ప్రభు త్వం రైతులకు ఇస్తున్న కనీస మద్దతు ధర, బోన స్‌ను కూడా పొందలేకపోతున్నాం.

- వరదపాక రాజాలు (రైతు, చింతలపాలెం)

మిర్యాలగూడ, హాలియా మిల్లులకు వెళ్లాల్సి వస్తోంది

మిర్యాలగూడ, హాలియా మిల్లులకు వెళ్లి ధాన్యం విక్ర యించాల్సి వస్తోంది. ఐదే ళ్లుగా నాకున్న రెండు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. కానీ మా ప్రాంతంలో కొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు మి ర్యాలగూడ, హాలియా మిల్లులకు వెళ్లి ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. దీనివల్ల ట్రాక్టర్‌ కిరాయిలకే ఎక్కువ ఖర్చు వస్తుంది. అధికారులు ఈ సీజన్‌లో కొనుగోలు కేంద్రాన్ని మా ప్రాంతంలో ప్రారంభించాలి.

- జర్పుల హేమ(రైతు, నాయకునితండా)

Updated Date - Apr 10 , 2025 | 12:43 AM