Share News

రాజీవ్‌ యువవికాసం లక్ష్యాలు ఖరారు

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:45 AM

నిరుద్యోగ యువతను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథ కం కింద యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆసక్తి ఉన్న వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 14వ తేదీవరకు అవకాశాన్ని కల్పించింది.

రాజీవ్‌ యువవికాసం లక్ష్యాలు ఖరారు

యూనిట్ల మంజూరుతోపాటు నిధుల కేటాయింపు

ఎస్సీ కార్పొరేషన్‌లో 3,644, ఎస్టీ 1,250, బీసీ లో 4,294, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్‌ 1,044 యూనిట్లు

ఈ నెల 14 వరకు దరఖాస్తుల ఆహ్వానం

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): నిరుద్యోగ యువతను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథ కం కింద యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆసక్తి ఉన్న వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 14వ తేదీవరకు అవకాశాన్ని కల్పించింది.

రాజీవ్‌ యువ వికాసం పథకానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్‌ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నా రు. చివరి తేదీని పొడిగించడంతో దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటివరకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 6,076 దరఖాస్తులు, ఎస్టీ కార్పొరేషన్‌లో 1,607, బీసీ కార్పొరేషన్‌లో 14,423, ఈబీసీ కార్పొరేషన్‌లో 404, మైనార్టీ కార్పొరేషన్‌లో 930, క్రిస్టియన్‌ కార్పొరేషన్‌లో 36 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే వారిలో వ్యవసాయ అనుబంధ పథకాలకు 21-60 సంవత్సరాలు, వ్యవసాయేతర పథకాలకు 21-55 సంవత్సరాల వయసు గల వారిని అర్హులుగా ప్రకటించింది. కుటుంబంలో ఒకరికి మాత్రమే పథకం వర్తించేలా మార్గదర్శకాలు జారీచేసింది. జిల్లాలో ఏఏ కార్పొరేషన్ల కింద ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేయాలన్న అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అన్ని శాఖలకు కూడా యూనిట్ల మం జూరుపై లక్ష్యాలను నిర్దేశించింది. ఈ మేరకు యూనిట్లు, నిధులు కూడా మంజూరు చేసింది.

స్వయం ఉపాధికి రుణాలు

ఈ పథకం కింద నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి రుణా లు మంజూరు చేయనున్నారు. బ్యాంకుల సమ్మతి ద్వారా వ్యవసా య ఆధారిత పరిశ్రమలు, గేదెలు, కోళ్ల పెంపకం, మైనర్‌ ఇరిగేషన్‌తోపాటు కిరాణ, ఇతర దుకాణాలకోసం రుణాలు మంజూరు చేయనున్నారు. రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు రుణాలు మంజూ రు చేయనున్నారు. ఈ పథకం కింద 100 శాతం నుంచి 70శాతం వరకు సబ్సిడీ మంజూరు చేయనున్నారు. రూ.50వేల రుణం పొందే వారికి 100శాతం సబ్సిడీ, రూ.లక్ష వరకు 90శాతం సబ్సిడీ.. 10శాతం బ్యాంకు రుణం, రూ.2లక్షల వరకు 80శాతం సబ్సిడీ, 20 శాతం బ్యాంకు రుణం, రూ.2నుంచి రూ.4లక్షల వరకు 70శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకు రుణం అందుతుంది. మైనర్‌ ఇరిగేషన్‌ పథకాల కింద బ్యాంకు రుణం లేకుండా 100శాతం సబ్సిడీ ప్రభుత్వం అవకాశం కల్పించింది.

యువత సద్వినియోగం చేసుకోవాలి : జె.శ్యాంసుందర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ

ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం రూపొందించిన వెబ్‌పోర్టల్‌లో వోబీఎంఎ్‌సఎస్‌ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకుని, అవసరమైన ధ్రువపత్రాలతో గ్రామీణ ప్రాంతాల వారు ఎం పీడీవో, పట్టణ ప్రాంతాల వారు మునిసిపాలిటీల్లో కమిషనర్లకు దరఖాస్తులు అందజేయాలి. ప్రభుత్వం ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిం ది. జిల్లాలోని యువత సద్వినియోగపరుచుకోవాలి.

కార్పొరేషన్‌ యూనిట్లు కేటాయించిన నిధులు

ఎస్సీ 3,644 రూ.50.32కోట్లు

ఎస్టీ 1,250 రూ.16.71కోట్లు

బీసీ 4,294 రూ.50కోట్లు,

ఈబీసీ, ఈడబ్ల్యూఎస్‌ 1044 రూ.12.50కోట్లు

Updated Date - Apr 10 , 2025 | 12:45 AM