బెనిఫిట్స్ ఎప్పుడిస్తారు?
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:18 AM
ఉద్యోగ విరమణ అనంత రం వచ్చే బెనిఫిట్స్ విడుదలలో జిల్లాల వారీ గా ప్రభుత్వం చూపుతున్న తేడాతో విశ్రాంత అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ఆర్థిక ఇబ్బందులకు గురువుతున్నారు.

విశ్రాంత అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల ఎదురుచూపు
జిల్లాకో విధానాన్ని అనుసరిస్తున్న ప్రభుత్వం
129 మందికి రూ.74.50లక్షలు పెండింగ్
(ఆంధ్రజ్యోతి,భువనగిరిటౌన్): ఉద్యోగ విరమణ అనంత రం వచ్చే బెనిఫిట్స్ విడుదలలో జిల్లాల వారీ గా ప్రభుత్వం చూపుతున్న తేడాతో విశ్రాంత అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ఆర్థిక ఇబ్బందులకు గురువుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన సేవలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిన 65 సంవత్సరాల కటా్‌ఫతో ఉమ్మడి జిల్లాలో జూలై 20 24న పెద్ద సంఖ్యలో టీచర్లు, ఆయా లు ఉద్యోగ విరమణ పొందారు.
వారికి ప్రభుత్వం నెలలోపు రూ.లక్ష, ఆయాలకు రూ. 50వేలు రిటైర్మెంట్ బెనిఫిట్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. సూ ర్యాపేట, నల్లగొండ జిల్లాలో విశ్రాంత టీచర్లకు, ఆయాల కు సుమారు అందరికీ ఈ బెనిఫిట్స్ అందగా, యాదాద్రి జిల్లాలో మాత్రం నేటికీ విశ్రాంత టీచర్లకు, ఆయాలకు ఎవ్వరికీ డబ్బు అందలేదు. దీంతో వృద్ధాప్యంతో 65 సంవత్సరాలకు ఉద్యోగ విరమణ పొందినప్పటికీ తొమ్మిది నెలలుగా బెనిఫిట్స్ కోసం ఆందోళనలతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని చేసినంత కాలం కనీస వేతనాలకు కూడా నోచుకోని తమకు కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను కూడా సకాలంలో ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
తొమ్మిది నెలలుగా ఎదురుచూపు
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం యాదాద్రి జిల్లా విశ్రాంత అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు తొమ్మిది నెలలుగా ఎదురుచూస్తున్నారు. జూలై 2024లో ఉద్యోగ విరమణ పొందిన 20 మంది టీచర్లకు రూ.లక్ష చొప్పున రూ.20లక్షలు, 109 మంది ఆయాలకు రూ.50వేల చొప్పున రూ.54.50లక్షలు మొత్తంగా 129 మంది విశ్రాంత ఉద్యోగులకు రూ.74.50 లక్ష లు బెనిఫిట్స్‌గా రావలసి ఉంది. దీం తో బెనిఫిట్స్ కోసం విశ్రాంత ఉద్యోగులు పలు పర్యాయాలు ధర్నా లు, దీక్షలు, ఆందోళనలు చేశారు. అధికారులకు, నాయకులకు వినతిపత్రాలు అందజేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించే ‘ప్రజావాణి’లో ఆర్జీలు సైతం ఇచ్చారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో వయోవృద్ధులైన వీరు మానసిక వేదనకు గురవుతున్నారు. అలాగే 129 మంది ఉద్యోగ విరమణతో పాటు అప్పటికే ఉన్న మరికొన్ని ఖాళీలతో కలిపి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ల, ఆయాల ఖాళీల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ఇన్‌చార్జీలతో నడుస్తున్న ఆయా కేంద్రాల్లో సేవలు అందక పిల్లలు బాలింతలు, గర్భిణులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. యాదాద్రి జిల్లాలో 901 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నా యి. 45,700 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 36,084 మంది ఆరేళ్లలోపు చిన్నారులు 5,024 మంది గర్భిణులు, 4,392 మంది బాలింతలు ఉన్నారు. ప్రస్తుతం 57 టీచర్ల పోస్టులు, 263 ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
బెనిఫిట్స్ కోసం తిరుగుతున్నాం : ఉపేంద్ర, విశ్రాంత అంగన్‌వాడీ టీచర్, మోత్కూర్
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం తొమ్మిది నెలలుగా అధికారులు, కార్యాలయా ల చుట్టూ తిరుగుతున్నాం. సంవత్సరాలపాటు పనిచేసినప్పటికీ కనీస వేతనం కూడా ఇవ్వని ప్రభుత్వం ఉద్యోగ విరమణ బెనిఫిట్స్‌ను కూడా అం తంతమాత్రంగానే ఇస్తోంది. ఆ కొద్దిపాటిని కూడా సకాలంలో ఇవ్వకుండా వేధిస్తుండటం అన్యాయం. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించాలి.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ హామీని నిలుపుకోవాలి: సిహెచ్.రమాకుమారి, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ యాదాద్రి జిల్లా కార్యదర్శి
ఉద్యోగ విరమణ పొందిన వెంటనే బెనిఫిట్స్ ఇస్తామనే హామీని ప్రభుత్వం నిలుపుకోవాలి. టీచర్లకు రూ.2లక్షలు, ఆయాలకు రూ.1 రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపుపై మంత్రి సీతక్క ఇచ్చిన హామీని నెరవేర్చాలి. టీచర్ల రూ.13,650, ఆయాలకు రూ.7800 వేతనాలను సవరించి కనీస వేతన చట్టం వర్తింపజేయాలి.
త్వరలోనే బెనిఫిట్స్ అందుతాయి: నరసింహారావు, యాదాద్రి జిల్లా సంక్షేమ అధికారి
విశ్రాంత అంగన్‌వాడీ టీచర్ల, ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ త్వరలోనే అందుతాయి. సాంకేతిక సమస్యలతోనే బెనిఫిట్స్ విడుదలలో ఆలస్యం నెలకొంది. ఇటీవలే ఆ సమస్యలను పరిష్కరించాం. ఈనెల చివరిలోపు బెనిఫిట్స్ బ్యాంక్ ఖాతాల్లో జమవుతాయి. ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు.