Share News

Aadhaar Card: ఆధార్‌ లేకున్నా వైద్యం అందించాలి

ABN , Publish Date - Feb 25 , 2025 | 04:20 AM

ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధార్‌ కార్డు ఉంటేనే వైద్యం అందిస్తున్నారని, లేకుంటే రోగులను అడ్మిట్‌ చేసుకోవడం లేదని పేర్కొంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది.

Aadhaar Card: ఆధార్‌ లేకున్నా వైద్యం అందించాలి

  • హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధార్‌ కార్డు ఉంటేనే వైద్యం అందిస్తున్నారని, లేకుంటే రోగులను అడ్మిట్‌ చేసుకోవడం లేదని పేర్కొంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. బైరెడ్డి శ్రీనివాస్‌ అనే వ్యక్తి దీనిని దాఖలు చేశారు. ఆధార్‌ కార్డు లేకపోయినా వైద్యం అందించేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజాయ్‌పాల్‌, జస్టిస్‌ రేణుక ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది ఎస్‌. రాహుల్‌రెడ్డి వాదిస్తూ.. ఆధార్‌ కార్డు లేకపోయినంత మాత్రాన వైద్యం నిరాకరించడం లేదని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేస్తామని పేర్కొన్నారు. దీంతో విచారణ ఈనెల 28కి వాయిదా పడింది.

Updated Date - Feb 25 , 2025 | 04:20 AM