Share News

Hyderabad: పూర్ణా.. ఆల్‌ ది బెస్ట్‌..

ABN , Publish Date - Jan 31 , 2025 | 08:26 AM

అతిచిన్న వయస్సులో ఎవరెస్ట్‌ పర్వతాన్ని అధిరోహించిన మాలావత్‌ పూర్ణను జేఎన్‌టీయూ(JNTU) ఉన్నతాధికారులు ఘనంగా సత్కరించారు. విద్యార్థి సంఘాల ఆహ్వానం మేరకు గురువారం యూనివర్సిటీకి వచ్చిన పూర్ణ.. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌, రెక్టార్‌, ప్రిన్సిపాల్‌తో పాటు పలు విభాగాల డైరెక్టర్లను మర్యాద పూర్వకంగా కలిశారు.

Hyderabad: పూర్ణా.. ఆల్‌ ది బెస్ట్‌..

- పర్వతారోహకురాలికి జేఎన్‌టీయూ ఉన్నతాధికారుల సత్కారం

- మరోమారు ఎవరె్‌స్టను అధిరోహించేందుకు వెళ్తున్న మాలావత్‌ పూర్ణ

- విద్యార్థుల అభినందనలు

హైదరాబాద్‌ సిటీ: అతిచిన్న వయస్సులో ఎవరెస్ట్‌ పర్వతాన్ని అధిరోహించిన మాలావత్‌ పూర్ణ(Malavat Poorna)ను జేఎన్‌టీయూ(JNTU) ఉన్నతాధికారులు ఘనంగా సత్కరించారు. విద్యార్థి సంఘాల ఆహ్వానం మేరకు గురువారం యూనివర్సిటీ(University)కి వచ్చిన పూర్ణ.. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌, రెక్టార్‌, ప్రిన్సిపాల్‌తో పాటు పలు విభాగాల డైరెక్టర్లను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆపై పలువురు సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌(Science and Engineering) విద్యార్థులతో మాలావత్‌ పూర్ణ తన పర్వతారోహణ అనుభవాలను పంచుకున్నారు. మాలవత్‌ పూర్ణ మాట్లాడుతూ... పర్వతారోహణ, ట్రెక్కింగ్‌, అడ్వెంచర్‌ చేయాలనుకునే ఔత్సాహిక విద్యార్థిని విద్యార్థులకు తానే స్వయంగా శిక్షణ ఇస్తానని తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Kukatpally: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు వివరాలివే..


city5.jpg

ఫిబ్రవరి 8న మరోమారు ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించేందుకు సమాయత్తమవుతున్న మాలావత్‌ పూర్ణకు విద్యార్థి సంఘాల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. పూర్ణను సత్కరించిన వారిలో యూనివర్సిటీ రెక్టార్‌ విజయకుమార్‌ రెడ్డి, రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్‌ నర్సింహరెడ్డి(Principal Narasimha Reddy), డైరెక్టర్లు వసుమతి, సుషమా, అరుణకుమారి, గిరిధర్‌, సమన్వయకర్తలు శోభారాణి, మాధవీకుమారి, సాహూ చత్రప తి, పలువురు విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఉన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

ఈవార్తను కూడా చదవండి: కవితకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రఘునందన్ రావు

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

ఈవార్తను కూడా చదవండి: గేదెలు కాసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్

Read Latest Telangana News and National News

Updated Date - Jan 31 , 2025 | 08:26 AM