Share News

Weather: రైయిన్ అలర్ట్.. రాబోయే 3 రోజులు భారీ వర్షం

ABN , Publish Date - Apr 12 , 2025 | 06:15 PM

వేసవికి అల్లాడిపోతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణశాఖ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. రాబోయే 3 రోజులు పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Weather: రైయిన్ అలర్ట్.. రాబోయే 3 రోజులు భారీ వర్షం
Rains

Telangana: తెలంగాణలో రానున్న మూడురోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సగటున సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని పేర్కొన్నారు.

ఈ ప్రభావం కారణంగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తుఫానుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, గత 3 రోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.

Updated Date - Apr 12 , 2025 | 07:04 PM