AV Ranganath: రాంకీ కబ్జాపై రంగనాథ్ పరిశీలన..
ABN , Publish Date - Apr 09 , 2025 | 07:00 AM
నగరంలో.. ప్రభుత్వ స్థలాలు, భవనాలు, ప్రభుత్వ ఆస్తులు, చెరువు, కుంటలను కాపాడేందుకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హైడ్రా.. మళ్లీ దూకుడు పెంచింది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అల్వాల్ మచ్చబొల్లారంలోని శ్మశాన వాటిక స్థలాల ఆక్రమణలపై విచారణ ప్రారంభించింది.

- ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా
- నిర్మాణాలు నిలిపివేయాలని సూచన
హైదరాబాద్ సిటీ: అల్వాల్ మచ్చబొల్లారంలోని శ్మశాన వాటిక స్థలంలో రాంకీ సంస్థ చెత్త డంపింగ్ చేయడంతో పాటు పలు నిర్మాణాలు చేపట్టి కబ్జాకు యత్నిస్తుందన్న ఫిర్యాదులపై హైడ్రా రంగంలోకి దిగింది. కమిషనర్ ఏవీ రంగనాథ్(Commissioner AV Ranganath) మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.
ఈ వార్తను కూడా చదవండి: వచ్చేస్తోంది కొత్త మందు..
మచ్చబొల్లారం మోతుకుల కుంటకు సమీపంలో ఉన్న హిందూ శ్మశానవాటిక స్థలంలో చెత్త వేస్తుండడంతో పరిసరాలు దుర్గంధభరితంగా మారి ఇబ్బందులు పడుతున్నామని మచ్చబొల్లారం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ కొన్నాళ్ల క్రితం హైడ్రాకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శ్మశానవాటిక, పక్కనున్న ప్రభుత్వ భూములను రంగనాథ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ 199లో మొత్తం 15.19 ఎకరాల స్థలం హిందూ శ్మశాన వాటికకు కేటాయించగా, అందులో రెండు ఎకరాలు రాంకీకి ఇచ్చినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.
కేటాయించినవే కాకుండా..
కేటాయించిన రెండెకరాలు కాకుండా, మరో రెండు, మూడెకరాలు అదనంగా కబ్జా చేసినట్టు స్థానికులు ఫిర్యాదు చేశారన్నారు. స్థానిక ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి(MP Etala Rajender, MLA Marri Rajasekhar Reddy), మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేశారని రంగనాథ్ తెలిపారు. ఇటీవల మంత్రి శ్రీధర్‌బాబు వద్ద జరిగిన సమావేశంలో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తనతోపాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబరిదికి సూచించారని, ఎంత భూమి కేటాయించారు..? ఎంత వినియోగిస్తున్నారన్నది తేలే వరకు నిర్మాణ పనులు నిలిపివేయాలని రాంకీ సంస్థను ఆదేశించినట్లు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం
నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్ ట్రైన్ లైన్లు
Read Latest Telangana News and National News