బంపర్ ఆఫర్.. రూ.9కే చీర.. షాపు వాళ్ల దిమ్మతిరిగిపోయింది..
ABN , Publish Date - Apr 04 , 2025 | 05:35 PM
Sarees For RS 9 In Vikarabad: మహిళలు ఇచ్చిన షాక్‌కు ఆ బట్టల షాపు యజమాన్యానికి దిమ్మతిరిగిపోయింది. 9 రూపాయలకే చీర అని తెలియగానే వందల మంది ఆడవాళ్లు షాపు ముందు బారులు తీరారు. చీరల కోసం గొడవ పెట్టుకున్నారు. వాళ్లకు చీరలు అందించలేక.. షాపు వాళ్లు చేతులు ఎత్తేశారు.

వికారాబాద్: ఓ బట్టల షాపు యజమాన్యం చేసిన ఓ మార్కెటింగ్ స్టంట్ బాంబులా బెడిసికొట్టింది. మహిళల దెబ్బకు వారికి దేవుడు కనిపించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. వికారాబాద్‌లో కొత్తగా ఓ బట్టల షాపు ప్రారంభమైంది. షాపును ప్రమోట్ చేసుకోవటానికి.. మార్కెటింగ్ స్టంట్‌లో భాగంగా ఓ పెద్ద ఆఫర్ పెట్టారు. కేవలం 9 రూపాయలకే చీర అని ప్రకటించారు. 9 రూపాయలకే చీర అని తెలియగానే మహిళలు పెద్ద సంఖ్యలో ఆ షాపు దగ్గరకు వచ్చారు. కొన్ని వందల మంది చీరల కోసం ఎగబడ్డారు. బ్యారికేడ్లు తోసుకుని మరి షాపులోకి వెళ్లడానికి ప్రయత్నించారు. అక్కడికి వచ్చిన వందల మంది మహిళల్ని అదుపు చేయటం షాపు వాళ్లకు సాధ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.
పోలీసులు వచ్చినా వారిని అదుపు చేయలేకపోయారు. బ్యారికేడ్ల అవతల ఉన్న మహిళలు ఒకర్ని ఒకరు తోసుకుంటూ..కొట్టుకుంటూ నానా గలబ చేశారు. వచ్చిన వందలాది మందికి చీరలు అందజేయటం బట్టల షాపు వాళ్లకు వీలు కాలేదు. దీంతో మహిళలు వారిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆ కోపంలో షాపు వాళ్లతో పాటు పోలీసులతో కూడా వాగ్వివాదానికి దిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోపై మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది మహిళల్ని తిడుతుంటే.. మరికొంతమంది ఆఫర్ పెట్టి మహిళల్ని ఇబ్బంది పెట్టిన షాపు యజమాన్యంపై ఫైర అవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
LSG vs MI Prediction: పంత్ వర్సెస్ పాండ్యా.. లెక్క సరిచేస్తారా..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్