Mahesh Kumar Goud: పునర్విభజనతో ద క్షిణాదికి తీవ్ర అన్యాయం
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:48 AM
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనిపలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోంది.. ఈడీ పెట్టిన కేసుల్లో 96 శాతం విపక్ష నేతలపైనే
టీపీసీసీ అధ్యక్షుడుమహేష్ గౌడ్
దక్షిణాది రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి
వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్
రౌండ్ టేబుల్ భేటీలో పునర్విభజనను వ్యతిరేకించిన వివిధ పార్టీలు, సంఘాలు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనిపలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బేగంపేట ప్లాజాహోట్‌లో సోమవారం తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో ‘పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన-దక్షిణ భారత భవిష్యత్తుపై’ సదస్సు నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈ అంశంపై అసెంబ్లీలో బిల్లు పెట్టేలా సీఎంతో మాట్లాడతామని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు కనీసం 35 శాతం అధికంగా నియోజకవర్గాలను పెంచాలని, లేదంటే మరో 25 ఏళ్ల పాటు పునర్విభజన అంశాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. స్థానికంగా రాజకీయ పార్టీల మధ్య ఎలాంటి వైరుధ్యాలున్నా ఈ అంశంపై కలిసికట్టుగా పోరాటం చేస్తామన్నారు. మోదీ శాశ్వతంగా ప్రధానిగా ఉండాలనుకుంటున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తామని, ఎంతవరకైనా వెళతామన్నారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని, ఈడీ పెట్టిన కేసుల్లో 96 శాతం ప్రతిపక్ష పార్టీల నేతలపై ఉన్నాయన్నారు. కేంద్రం గత 11 ఏళ్లలో తెలంగాణకు ఇచ్చింది ఏమిటంటే సున్నా అని ఎద్దేవా చేశారు.
తమిళనాడు వీసీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, చిదంబరం ఎంపీ తొల్.తిరమావళవన్ మాట్లాడుతూ పునర్విభజన కుట్రలపై దక్షిణాది రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోదీ, అమిత్ షా ఆర్‌ఎ్‌సఎ్‌సలో పెరిగినవాళ్లని, ఆ సంస్థ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్లేందుకు పనిచేస్తున్నారని విమర్శించారు. దళితులు, ఆదివాసీలు, ముస్లింల ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలను విభజన చేసి, అశాస్ట్రీయంగా వాటి సరిహద్దులు మార్చడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తమిళనాడు విల్లుపురం ఎంపీ డీ రవికుమార్ మాట్లాడుతూ పునర్విభజనతో దక్షిణాదిలో 35 సీట్లు పెరిగితే, ఒక్క బిహార్‌లోనే 39 సీట్లు పెరుగుతాయన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 80నుంచి 140కి పెరిగే అవకాశం ఉందన్నారు. ఇదే జరిగితే యూపీ, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఏం అనుకుంటే అది జరిగే ప్రమాదం ఉందన్నారు. జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ పునర్విభజన వెనక దక్షిణాది రాష్ట్రాల ప్రజాస్వామిక ప్రాతినిధ్యాన్ని తగ్గించాలనే కుట్ర ఉందన్నారు. కేంద్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు 30 శాతం నిధులు వస్తే ఉత్తరాది రాష్ట్రాలకు 250 శాతం ఖర్చుపెడుతున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, సీపీఐ కార్యదర్శి పశ్యపద్మ, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు కె.గోవర్ధన్, దళిత బహుజన ఫ్రంట్ నాయకుడు కొరివి వినయ్ కూడా ప్రసంగించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్
దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళుతున్నారు..
మరో ఆరుగురికి నోటీసులు.. విచారణ...
For More AP News and Telugu News