Priyanka Gandhi: బిధూరి వ్యాఖ్యలు సంస్కారహీనం: శ్రీధర్‌బాబు
ABN, Publish Date - Jan 07 , 2025 | 05:26 AM
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీని అవమానించేలా బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్‌బాబు ఖండించారు.

హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీని అవమానించేలా బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్‌బాబు ఖండించారు. బీజేపీకి మహిళలంటే గౌరవంలేదని ఆయన విమర్శించారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలను చేసిందని, అలాంటి గొప్ప కుటుంబాలకు చెందిన వ్యక్తుల గురించి సంస్కారహీనంగా మాట్లాడడం ఎంత వరకు సమంజసమో బీజేపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.
అత్యధిక రికార్డు మెజార్టీతో ప్రజలు ఎన్నుకున్న మహిళా ఎంపీపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టేనని అన్నారు. మీడియాలో ప్రచారం, సంచలనాల కోసం గాంధీ కుటుంబంపై వివాదస్పద వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు.
Updated Date - Jan 07 , 2025 | 05:26 AM