Union Minister: 60 శాతం గ్రామాల్లో హైస్పీడ్ ఇంటర్‌నెట్ లక్ష్యం
ABN , Publish Date - Jan 18 , 2025 | 08:33 AM
దేశంలోని కనీసం 60 శాతం గ్రామాల్లో ఇంటర్‌నెట్‌ను 100 ఎంబీపీఎస్‌తో అందించాలనేది ప్రధాని మోదీ(Prime Minister Modi) కల అని, వికసిత్ భారత్ లక్ష్యమని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Union Minister Jyotiraditya Sindia) అన్నారు.

- కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
హైదరాబాద్: దేశంలోని కనీసం 60 శాతం గ్రామాల్లో ఇంటర్‌నెట్‌ను 100 ఎంబీపీఎస్‌తో అందించాలనేది ప్రధాని మోదీ(Prime Minister Modi) కల అని, వికసిత్ భారత్ లక్ష్యమని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Union Minister Jyotiraditya Sindia) అన్నారు. శుక్రవారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ఎన్‌బీఎం (జాతీయ బ్రాడ్‌బాండ్ మిషన్) 2.0ను, సంచార్ సాథి మొబైల్ యాప్‌ను, ఇంట్రా సర్కిల్ రోమింగ్ 4జి (డిజిటల్ భారత్ నిధి) ద్వారా మొబైల్ సైట్స్‌ను ఆయన ఢిల్లీలో వర్చువల్‌గా ప్రారంభించారు.
ఈ వార్తను కూడా చదవండి: Vikarabad: అమ్మమ్మే అమ్మకానికి పెట్టింది..
ఈ సందర్భంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద గల సీటీఓ బిల్డింగ్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి ఆయన మాట్లాడుతూ.. ఎన్‌బీఎం 1.0లో 8 లక్షల టవర్లను ఏర్పాటు చేశామని, సంచార్ సాథి ద్వారా చోరికి గురైన 25 లక్షల మొబైళ్లకు గాను 15 లక్షల మొబైల్స్ స్వాధీనం చేసుకోగలిగామన్నారు. వెబ్‌సైట్‌గా ఉన్న సంచార్ సాథిని మొబైల్ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టెలికాం శాఖ ప్రత్యేక డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ ఆర్ పాటిల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆ దొంగలు ఎక్కడ?
ఈవార్తను కూడా చదవండి: 6 హామీల్లో అర గ్యారెంటీనే అమలు
ఈవార్తను కూడా చదవండి: ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ
ఈవార్తను కూడా చదవండి: హై అలర్ట్‌గా తెలంగాణ- ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
Read Latest Telangana News and National News