Share News

Yadadri Thermal Plant: యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌కు ఉద్యోగుల బదిలీలు

ABN , Publish Date - Apr 13 , 2025 | 04:29 AM

నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి(వైటీపీఎస్‌) భారీ సంఖ్యలో విద్యుత్‌ ఇంజనీర్లు, సిబ్బందిని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (టీ జీజెన్‌కో) బదిలీ చేసింది.

Yadadri Thermal Plant: యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌కు ఉద్యోగుల బదిలీలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి(వైటీపీఎస్‌) భారీ సంఖ్యలో విద్యుత్‌ ఇంజనీర్లు, సిబ్బందిని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (టీ జీజెన్‌కో) బదిలీ చేసింది. ఇద్దరు సూపరింటెండింగ్‌ ఇంజనీర్లు (ఎస్‌ఈ), ఒక డీఈ, 29 మంది ఏడీఈలు, 60 మంది ప్లాంట్‌ అటెండెంట్లు, 30 మంది జూనియర్‌ ప్లాంట్‌ అటెండెంట్లకు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో పోస్టింగ్‌ ఇస్తూ ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి, జెన్‌కో సీఎండీ సందీ్‌పకుమార్‌ సుల్తానియా శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు.


వీరితో పాటు గత ఏడాది జూన్‌ 4న మూసివేసిన రామగుండం థర్మల్‌-బీ విద్యు త్‌ కేంద్రంలో పనిచేస్తున్న 28 మంది ఫోర్‌మన్లు, 30 మంది ప్లాంట్‌ అటెండెంట్లు, 14 మంది జూనియర్‌ ప్లాంట్‌ అటెండెంట్లకు కూడా పోస్టింగ్‌ ఇచ్చారు. బదిలీ అయిన వారిలో రామగుండం థర్మల్‌-బీ విద్యుత్‌ కేంద్రం లో పనిచేస్తున్న ఒక ఎస్‌ఈ, డీఈ, 11 మంది ఏడీఈలు కూడా ఉన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 04:29 AM