Share News

శాలిగౌరారం ఫీడర్‌ ఛానల్‌లో అన్నదాతల శ్రమదానం

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:56 PM

శాలిగౌరారం ప్రాజెక్టుకు అనుసంధానం గా ఉన్న ఫీడర్‌ ఛానల్‌ పరిధిలో గుర్రపు డెక్క పేరుకుపోయి నీటి రాకను అడ్డుకుంటోంది.

 శాలిగౌరారం ఫీడర్‌ ఛానల్‌లో  అన్నదాతల శ్రమదానం

శాలిగౌరారం ఫీడర్‌ ఛానల్‌లో అన్నదాతల శ్రమదానం

గుర్రపు డెక్కను తొలగించిన రైతులు

శాలిగౌరారం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): శాలిగౌరారం ప్రాజెక్టుకు అనుసంధానం గా ఉన్న ఫీడర్‌ ఛానల్‌ పరిధిలో గుర్రపు డెక్క పేరుకుపోయి నీటి రాకను అడ్డుకుంటోంది. దీంతో శాలిగౌరారం ప్రాజెక్టుకు నీరు సక్రమంగా రావడం లేదు. దీంతో రైతు సంఘం నాయకులు చామల వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని తిరుమలరాయినిగూడెం, జాలోనిగూడెం, రామగిరి గ్రామాలకు చెందిన రైతులు త రలివెళ్లి శ్రమదానం చేశారు. ఫీడర్‌ ఛానల్‌ పరిధిలోని తుర్కపల్లి హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద పేరుకుపోయిన గుర్రపు డెక్కను రైతులు శ్రమదానంతో తొలగించారు. అమ్మనబోలు జాలకుంట వద్ద మూసీ నదిలోకి పేరుకుపోయిన గుర్రపు డెక్కను రైతులు శ్రమదానంతో తొలగించారు. అమ్మనబోలు జాలకుంట వద్ద మూసీ నదిలోకి నీరు వృథాగా పోకుండా ఇసుక బస్తాలను అడ్డుగా వేసి శాలిగౌరారం ప్రాజెక్టులోని నీటిని మళ్లించారు. శ్రమదానం చేసిన వారిలో ఆకుల యాదయ్య, పడాల రమేష్‌, పెంబళ్ల శ్రీనివాస్‌, వాడపల్లి అంజయ్య, పడాల రవి, తరాల సైదులు, చీమల శంక ర్‌, పెంబళ్ల శంకర్‌, మాద నర్సింహ ఉన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 11:56 PM